Blog
Konaseema-Amalapuram: కెనడా అమ్మాయి – ఇండియా అబ్బాయి.
కెనడాకు చెందిన యువతిని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడు. అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి శివారు వైకుంఠపురానికి చెందిన మనోజ్ కుమార్ కెనడా దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ దేశానికి చెందిన సహోద్యోగి ట్రేసీ రోచేదాన్ అతడికి పరిచయమైంది. ఇరువురి అభిప్రాయాలు మనసులు కలవడంతో సన్నిహితంగా ఉండేవారు. ఈపరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో కెనడా దేశంలో వధువు రోచేడాన్ తో మనోజ్ కుమార్ కు వివాహమైంది.ఇటీవల ఇండియా వచ్చిన ఆ జంట అమలాపురానికి వచ్చి భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం త్వరలో పెళ్లి చేసుకునేందుకు సోమవారం నుంచి సన్నాహాలు మొదలు పెట్టారు. బంధుమిత్రులతో ఆ ఇంట పెళ్లి సందడి నెలకొంది.
Chintalapoodi : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్
జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అదనపు గదులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్50 లక్షల రూపాయల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదనపు గదులకు శంకుస్థాపన అదనపు గదులు నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్ణీత సమయానికి ప్రభుత్వ ఆసుపత్రికి రాని డాక్టర్లను ఉపేక్షించెను. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 లక్షల నిధులతో కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ల్యాబ్ గదులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే వైద్య సేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రజలకు వైద్యం అందిచేందుకు ఏ విధమైన ఇబ్బంది కలిగిన ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ సిబ్బంది ఆశా వర్కర్లు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Kaikaluru: చేతబడులు చేస్తున్నారని అనుమానంతో ముగ్గురిపై దాడి – 18 మంది పై కేసు నమోదు.
కైకలూరు మండలంలోని చటాకాయ గ్రామంలో చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులపై దాడి జరిగిన సంఘటనలో 18 పై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. సమావేశంలో సీఐ రవికుమార్ మాట్లాడుతూ.. చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను గ్రామంలోని కొంతమంది వ్యక్తులు కలిసి విచక్షణారహితంగా వారిపై దాడి చేశారన్నారు. దాడిలో ఇద్దరు వ్యక్తులకు చేతులు విరగగా… మరో వ్యక్తి కనిపించని గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై అదే గ్రామానికి చెందిన సైదు రఘు అనే వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్లో 18 మందిపై కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిందన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కైకలూరు రూరల్ ఎస్సై నిందితులను అరెస్టు చేయగా వారిలో ప్రధాన నిందితులైన ఆరుగురును కైకలూరు జె ఎఫ్ సి ఎం కోర్టు కు రిమాండ్ నిమిత్తం ... Read more
Denduluru : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
రైతులు వద్ద నుండి ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లోకి నగదు జమవుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు. పెదపాడు మండలం కొక్కిరపాడు లోని రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఉదయం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. రైతు బాగుండాలి, వ్యవసాయం లాభసాటిగా వుండాలి అనే నినాదంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందని, గతంలో రైతు కష్టపడి పండించిన పంటను అమ్మేందుకు చాలా ఆంక్షలు వుండేవని, కనీసం గోనే సంచులను సరఫరా చేయలేక గత ప్రభుత్వం చేతులెత్తేసిందని, ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి రైతులను అవస్థలు పాలు చేసిందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. వైసిపి నాయకులు నిర్దేశించిన రైస్ మిల్లులోనే అమ్మాలని, రైతులను ఇబ్బంది పెట్టేవారని అటువంటి పరిస్థితి ఇకనుండి రైతులకు రాకూడదనే మిల్లులు ఎంపిక కూడా రైతులకే అందించామని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంక్ అకౌంట్లో ... Read more
Kaikaluru : ఉత్తిర్ణత సాధించిన పదవ తరగతి విద్యార్థులకు లాప్టాప్ లు అందించిన కామినేని శ్రీనివాస్.
ఏలూరుజిల్లా ముదినేపల్లి మండలం ముదినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 550 పైన ఉత్తిర్ణత సాధించిన 11 మంది విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఎన్నారైలు దొడ్డపనేని బాబురావు, రామకృష్ణ ఆర్ధిక సహకారంతో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ 11 మంది విద్యార్థులకు లాప్టాప్లు వీటితో పాటు రూ.5000/- (అయిదు వేల రూపాయిలు) నగదును అందజేశారు. ఈ సందర్బంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ దాతలు ఈ విధంగా విద్యార్థులను ప్రోత్సహించటం చాలా సంతోషకారంగా ఉందని, విద్యార్థులు ఇలాంటి బహుమతులు మరెన్నో అందుకుని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బట్టలు, మొదలుగునవి బహుకరించటం చూసాం కానీ లాప్టాప్ లు బహుమతిగా అందించడం చాలా ఆనందదాయకం అని కొనియాడారు. వీటిని మంచిగా ఉపయోగించుకుని మంచి మార్గంలో ప్రయాణించాలని కన్న వారికీ, చదువు నేర్పిన గురువులకు, వున్న ఊరికి మంచి పేరు తేవాలని విద్యార్థులను కోరారు. ఈ ... Read more
Polavaram : కార్తీకమాస వన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
కార్తీకమాసం ప్రతి సంవత్సరం జరిగే వనభోజనాల కార్యక్రమం పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. వనభోజనాల కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు ప్రజలతో సరదాగా గడిపారు ప్రజలతో కలిసి కార్తీకమాస వనభోజనాలను స్వీకరించారు.ఎమ్మెల్యే బాలరాజు తో పోలవరం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ గారు జనసేన పార్టీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటంసాయి పాల్గొన్నారు. ముందుగా పోలవరం జనసేన పార్టీ మండల నాయకులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యేను భారీ ర్యాలీతో డప్పు వాయిద్యాలతో తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో పోలవరం మండలంలో కూటమి నాయకులు జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
Undi : పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభించిన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు.
ఉండి నియోజకవర్గం ప్రధాన కేంద్రమైన ఉండి పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభించిన. స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ పి నాగరాణి. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఎస్పీ మాట్లాడుతూ నూతన భవనాన్ని ప్రజా ప్రతినిధులతో ప్రారంభించడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ త్వరలోనే నియోజకవర్గం లో పోలీస్ స్టేషన్లను మారుస్తున్నట్లు అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ కు కొత్త వెహికల్ ఏర్పాటు చేస్తున్నట్లు క్రైమ్ రేట్ తగ్గించే దిశగా నియోజవర్గం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Denduluru : అయ్యప్ప , భవాని మాల దీక్షాదారులకు అల్పాహారం – దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
అయ్యప్ప , భవాని మాల దీక్షాదారులకు ప్రతి రోజూ వడై (అల్పాహారం) ఏర్పాటు చేస్తున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా చింతమనేని ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయిన ఆయన చేస్తున్న ప్రజా సేవా కార్యక్రమాలు మాత్రం ఏ రోజు ఆగకపోవటం చింతమనేని ప్రభాకర్ కార్యదక్షతకి నిదర్శనం అని చెప్పవచ్చు. కొవిడ్ విలయ తాండవం చేస్తున్న సమయంలో సైతం కొవిడ్ కేంద్రాల వద్ద పేషంట్లు బంధువులకు, అలాగే లాక్ డౌన్ టైమ్ లో హైవే పై ప్రయాణించే ప్రయాణికులకు లారీ డ్రైవర్లకు కూడా ఆహారాన్ని అందించారు చింతమనేని ప్రభాకర్. దుగ్గిరాల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిత్యం జరుగుతున్న స్వాములకు, భవానీలకు వడై (అల్పాహార) కార్యక్రమాలను సోమవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పర్యవేక్షించి, స్వాములు భవానీలతో కలిసి వడై స్వీకరించారు. ప్రతి నిత్యం వడై కోసం ... Read more