Blog
Telangana : మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ 12 సంవత్సరాల తరువాత బెయిల్ రావడంతో.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో మద్దెలచెరువు సూరి హత్య కేసు సంచలనమే సృష్టించింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకిరణ్ కు బెయిల్ మంజూరు కావడంతో బుధవారం చంచల్ గూడ జైలు నుండి విడుదల అయ్యారు. హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుండి విడుదల అయ్యి బయటికి వచ్చారు.
Telangana : గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ను కలిసి కులగణన కార్యక్రమాన్ని వివరించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాజభవన్లో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా గవర్నర్ వర్మకు ఆయన తెలిపారు. దేశానికి రోల్ మోడల్గా నిలిచేలా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ భేటీలో సీఎం రేవంత్, ప్రభుత్వ సలహాదారులు నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీతోపాటు ఎంపీలు బలరాం నాయక్, కిరణ్ కుమార్ రెడ్డి, రాజభవన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
Kaikaluru : కామినేని శ్రీనివాస్ ను కలిసిన గ్రీన్ విలేజ్ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.
కైకలూరులోని క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు డా” కామినేని శ్రీనివాస్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఏలూరు రోడ్డులోని గ్రీన్ విల్లెజ్ కాలనీ వాసులు. ఈ సందర్బంగా కాలని వాసులు మాట్లాడుతు కాలని ఎదురుగా పెద్దఎత్తున డంపింగ్ చేసిన చెత్తను తొలగించి తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు తీర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలానే కాలినీని అభివృద్ధి చెయ్యాలని కోరారు. శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి త్వరలోనే మీ సమస్యలు పరిష్కరించి కాలనీ అభివృద్ధి చేస్తామని తెలిపారు.
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి భక్తి పాటలు ఆవిష్కరించిన శ్రీరామ్ తాతయ్య – పాటలు రచించి, పాడిన సయ్యద్ జమీల్ అహ్మద్.
కైకలూరు విద్యాంజలి విద్యాసంస్థల అధినేత సయ్యద్ జమీల్ అహ్మద్ స్వయంగా రచించి పాడిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి రెండు భక్తి పాటలను శ్రీ వాసవి మాత ముద్దుబిడ్డ, ఆర్యవైశ్య అభిమాన నాయకుడు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య వారి చేతుల మీదుగా బుధవారం నాడు ఆవిష్కరించారు. అనంతరం శ్రీరాం తాతయ్య రచయత,సిగర్ జమీల్ ను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ముస్లిం సోదరుడు కుల మతాలకు అతీతంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిపై పాటలు రచించి, పాడడం మా ఆర్యవైశ్యులందరికీ గర్వకారణం అని అభినందించారు. ఈ కార్యక్రమంలో పైడిమర్రి జయ శ్యామల మాల్యాద్రి రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి, ఈదా వెంకటస్వామి కైకలూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి, గడిదేసి విజయ్, కనిశెట్టి శ్యామ్, జగ్గయ్యపేట ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు పాల్గొన్నారు.
Kaikaluru : సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద రాటను ప్రతిష్టించి షష్ఠి ఉత్సవ పనులను ప్రారంభించిన కామినేని శ్రీనివాస్.
ముదినేపల్లి మండలంలోని సింగరాయపాలెం గ్రామం చేవూరుపాలెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నందు రానున్న షష్ఠి మహోత్సవాలు సందర్భంగా కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ బుధవారం ఉదయం ఆలయ ప్రాకారములో రాటను ప్రతిష్టించి షష్టి మహోత్సవ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారి షష్ఠి మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని.. కమిటీ సభ్యులు ఓర్పుతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ సిబ్బంది మరియు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలు ఆధ్యాత్మికతతో వైభవంగా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Bhimavaram : అయోధ్య శ్రీరామునికి 13 కేజీల వెండి, ఒక కేజీ బంగారంతో తయారుచేసిన ధనస్సు – శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు అందుకున్న అయోధ్య రాముని మహా ధనస్సు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మాట్లాడుతూ అయోధ్య నగరానికి వెళుతున్న ఈ రామ ధనస్సు ఎంతో విశిష్టమైనదని, ఏడు మోక్షమార్గాలలో అయోధ్య మొదటిదని, ఒక కేజీ బంగారం, 13 కేజీలు వెండితో తయారు చేసిన ధనస్సు చల్లా శ్రీనివాస ఆధ్వర్యంలో శ్రీరాముడు పుట్టిన అయోధ్యకు ఈ ధనుస్సుని తీసుకువెళుతున్నారని, ఈ ధనస్సు ఈ ప్రాంతానికి రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని తెలిపారు. శ్రీ మావుళ్ళమ్మ ఆలయం వద్ద జైశ్రీరామ్ నినాదాలతో భక్తి పారవశ్యంతో పర్వసిశించారు భక్తులు.
Telangana – No Caste Column: తెలంగాణలో కుల గణనలో భాగంగా నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
తెలంగాణలో కుల గణనలో భాగంగా నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సామాజిక న్యాయం సాధికారతలో భాగంగా కులగణన చేపడతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. విద్య, ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యత, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా కుల గణన చేపట్టాలని భావించింది. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణనకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి కుటుంబాల నుంచి వివరాలు సేకరిస్తారు. దేశానికి రోల్ మోడల్ అయ్యేలా తెలంగాణలో కుట గణన చేపడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజల నుంచి వివరాలను సేకరించే దరఖాస్తుల్లో కులం, మతం వెల్లడించని వారి వివరాల నమోదుకు నో కాస్ట్, నో రిలిజియన్ కాలమ్ పెట్టాలంటూ దాఖలైన పిటిషనర్ల వినతులను పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశించింది.
Kaikaluru – Mubinepalli : అక్రమ మద్యం కలిగి ఉన్నా, బెల్టు షాపులు నిర్వహించినా చర్యలు తప్పవు – ఎస్సై వీరభద్రరావు హెచ్చరిక.
చట్ట విరుద్ధంగా అక్రమ మద్యం కలిగి ఉన్నా, బెల్ట్ షాప్ లు నిర్వహించినా కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ముదినేపల్లి ఎస్సై వీరభద్రరావు మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ… మండలంలోని వైవాక గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమ మద్యం కలిగి ఉండి బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో తన సిబ్బందితో కలిసి దాడిచేసి వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల వద్ద నుండి 120 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.