Category: రాయలసీమ

శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. గత నెల జూలైలో ప్రారంభమైన వరద ప్రవాహంతో క్రమంగా జలాశయం నిండుకుంది. జూలై 29 తేదీన జలాశయం మూడు క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ పరివాహక ప్రాంతాలు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుండడంతో శుక్రవారం డ్యామ్‌ అధికారులు జలాశయం 10 క్రస్టుగేట్లును 14 అడుగులు ఎత్తి నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 2,89,265 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 40,311 క్యూసెక్కులు మొత్తం 3,29,576 వరద ప్రవాహం వస్తోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 3,92,415 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు ... Read more

చిట్టి దోసెలతో రోజుకు రూ.10 వేలు సంపాదిస్తున్న మహిళ, రుచి సూపర్ అంటూ కస్టమర్లు క్యూ-sri sathya sai district kutagulla village road side hotel woman making dosa earns 10k daily ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

[ad_1] నర్సమ్మ దోసెలు రుచిచూడాల్సిందే శ్రీ సత్యసాయి జిల్లా : కదిరికి సమీపంలోని కూటగుళ్ల గ్రామంలో నర్సమ్మ హోటల్ ఉంది. రోజుకు రూ.10 వేలు చొప్పున నెలకు దాదాపు రూ. 3 లక్షల వ్యాపారం జరుగుతుందని నర్సమ్మ తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారం సాఫీగా సాగుతుందని అంటున్నారు. నర్సమ్మ హోటల్ లో వివిధ రకాల దోసెలు విక్రయిస్తారు. ఎగ్ ఎగ్ దోసె రూ. 25 , సాధారణ దోసెలు రూ. 10 , కారం దోసెలు రూ.25 అందిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం వరకు అమ్మకాలు జరుగుతాయని నర్సమ్మ తెలిపారు. రోడ్డు పక్కనే కావడంతో వాహనదారులు, ప్రయాణికులు ఈ హోటల్ కు వస్తుంటారు. నర్సమ్మ హోటల్ దోసెల రుచి తెలిసిన స్థానిక కూలీలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు అక్కడకు నిత్యం వస్తుంటారు. తక్కువ ఖర్చు, రుచికి అమోఘంతో నర్సమ్మ దోసెల కోసం క్యూ కడుతుంటారు. ఈ హోటల్ ... Read more