Category: రాయలసీమ
Tirupati : టీటీడీలో ప్రక్షాళన జరిగింది కాబట్టే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయి టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు.
వచ్చే బోర్డు మీటింగ్‌లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం- టీటీడీ నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీ నూతన ఛైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. తనకు ఆ బాధ్యత అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు వచ్చే బోర్డు మీటింగ్ లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి కొన్ని మార్పులు చెయ్యాల్సి ఉందన్నారు. సవాళ్లు ఉన్నాయని, అన్నింటిని అధిగమిస్తామన్నారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ ఎలా కాపాడుకోవాలి అనే దానిపై దృష్టి పెడతామన్నారు ఉద్యోగాల నియామకాలపై అధ్యయనం చేస్తామన్నారు. శ్రీవాణిపై ప్రజల్లో అపోహ ఉందన్న బీఆర్ నాయుడు.. విజిలెన్స్ విచారణ జరుగుతోందని, సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. టీటీడీలో ప్రక్షాళన జరిగింది కాబట్టే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయని టీటీడీ నూతన ఛైర్మన్ అన్నారు. టీటీడీ నూతన ఛైర్మన్ గా బీఆర్ నాయుడు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 16 ... Read more
Tirupati : శ్రీవారి అన్న ప్రసాద భవనాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ -కుటుంబ సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు.
తిరుమలలోని శ్రీవారి అన్న ప్రసాద భవనాన్ని బుధవారం రాత్రి టీటీడీ నూతన చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర అన్న ప్రసాదం కార్యాకలాపాలను చైర్మన్ కు వివరించారు. అన్న ప్రసాద భవనంలో ఒకరోజులో ఎంతమంది భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరిస్తారు, అందిస్తున్న వివిధ రకాలైన ఆహార పదార్థాలు, అన్న ప్రసాద భవనం పని చేసే వేళలు తదితర విషయాల గురించి సవివరంగా తెలియజేశారు.
Tirupati Accident : శిల్పారామంలో ఆటవిడుపు కోసం వెళ్ళి మృతి చెందిన యువతి.
తిరుపతి మండలం తిరుచానూరుఅర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుపతి శిల్పారామంలో జ రిగింది. ప్లే జోన్లో ఉన్న శిల్పారామంలో క్రాస్ వీల్ బకెట్ ఊడిపడటంతో అందులో కూర్చున్న యువతులు కిందప డిపోయారు. ఈ ఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా మ రొకరు తీవ్రంగా గాయపడ్డారు.ఆదివారం సెలవు దినం కావడంతో ఆటవిడుపు కోసం వెళ్లిన ఇద్దరు యువతులు అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యారు. తిరుపతి జిల్లా, తిరుచానూరు రోడ్డు లోని శిల్పారామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఎక్కిన క్రాస్ వీల్ తుప్పు పట్టి ఊడి కిందపడటంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతికి చెందిన లోకేశ్వరి(25), గౌతమి లు ఆదివారం సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు శిల్పారామం వచ్చారు. ఇద్దరు కలిసి అక్కడ ఉన్న క్రాస్ వీల్ ఎక్కారు. అది వేగంగా తిరుగుతుండగా యువతులు కూర్చొన్న సీటు దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి ఊడి కింద పడింది. దీంతో లోకేశ్వరి తీవ్ర ... Read more
చిన్నారిని చిదిమేసిన కామాంధుడు..!! – తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల గిరిజన బాలికపై బంధువు కిరాతకం
చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడి, హత్య – బాలికను మురికి కాలువలో తొక్కేసిన కిరాతకుడు.. నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు, బంధువులు రాత్రంతా చిన్నారి కోసం వెతుకులాట – వేకువజామున మృతదేహం వెలికితీత తిరుపతి జిల్లా వడమాలపేటలో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని మూడున్నరేళ్ల గిరిజన చిన్నారిపై ఓ కామాంధుడు అతికిరాతకంగా లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేశాడు. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా కేవీబీ పురం ఓళ్లూరు గిరిజన కాలనీకి చెందిన దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి దీపావళి పండుగ కోసం పది రోజుల క్రితం వడమాలపేట మండలం ఏఎం పురం వచ్చారు. చిన్నారి మేనమామకు కాలు విరగడంతో ఆ బాలిక తండ్రి, కుటుంబీకులు సమీపంలోని పుత్తూరు రాచపాలెంలో వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చిన్నారి తల్లితో ఉంది. చిన్నారికి వరుసకు మేనమామ అయిన ఏఎం పురానికి చెందిన సుశాంత్ ఆ బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని ... Read more
AndhraPradesh : దీపం-2 పథకం ప్రారంభం. స్వయంగా టీ తయారు చేసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో దీపం-2 పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. స్వయంగా టీ తయారుచేశారు. సీఎం చంద్రబాబు దీపం-2 పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనతరం అంబటి శాంతమ్మ అనే మహిళ ఇంటికెళ్లి ఉచిత సిలిండర్ కనెక్షన్ బిగించి స్టవ్ పై పాలు మరిగించారు. చంద్రబాబు స్వయంగా టీ తయారు చేశారు. మహిళ కుటుంబసభ్యులతో కలిసి టీ తాగారు. సీఎం వెంట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
తిరుమలలో మరోసారి చిరుత కలకలం..
శనివారం అర్ధరాత్రి సమయంలో తిరుమలలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది.. శ్రీవారి మెట్లు మార్గంలో చిరుత సంచారం.. అర్ధరాత్రి సమయంలో కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చిన చిరుత.. భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి లాక్ వేసుకున్న సెక్యూరిటీ గార్డ్.. టీటీడీ అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చిన సెక్యూరిటీ గార్డ్.. సీసి టీవి ఫుటేజ్ పరిశీలించిన అధికారులు.
putta Mahesh : ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించిన పొగాకు రైతులు.
పొగాకు రైతులకు జిల్లాలో 15 కోట్లు, రాష్ట్రంలో 110 కోట్లు లబ్ది ఏలూరు: ఇటీవల దేవరపల్లి లో జరిగిన పొగాకు రైతుల అవార్డుల వేడుకలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రైతులు వారి సమస్యలు చెప్పగా తక్షణం స్పందించిన ఎంపీ ఢిల్లీ లో కేంద్ర కామర్స్ మినిస్టర్ ను కలిసి రైతులు అదనంగా పండించిన పొగాకు పంట పై ఫెనాల్టీ రద్దు చేయాలని కోరారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం అదనంగా పండించిన పొగాకు పంటకు ఫెనాల్టీ రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది.ఈ సందర్బంగా జిల్లాలో పొగాకు పంట పండించిన రైతులు వందలాదిగా ఏలూరు వచ్చి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించారు.పొగాకు రైతు సంఘాల అద్యక్షులు పరిమి రాంబాబు, కరాటం రెడ్డి నాయుడు, కాకర్ల వివేకానంద లు మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి వలన జిల్లాలో ఉన్న 15 వేల మంది పొగాకు ... Read more
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 గేట్ల ద్వారా నీటిని విడుదల
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 గేట్ల ద్వారా శుక్రవారం నీటిని విడుదల చేసిన అధికారులు. 22 క్రస్ట్‌గేట్లను 5 అడుగులు, 4గేట్లను 10అడుగుల మేర ఎత్తి 2,30,504 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జునసాగర్ జలాశ యం నీటిమట్టం 587.50 అడుగులు ఉంది. ఇది 305.80 టీఎంసీలకు సమానం. కుడి కాలువ ద్వారా 8680 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8367, 26 క్రస్ట్‌గేట్ల ద్వారా 2,30,504, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29,029, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 2,78,380 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 3,11,491 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కాగా 26 క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు విడుదల చేస్తుండడంతో తిలకించేందుకు పర్యాటకులు శుక్రవారం పోటెత్తారు. రహదారులు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సందడిగా గడిపారు. 42 టీఎంసీలకు చేరిన నదీ జలాలు వరదతో ... Read more