Category: Andhra Pradesh

ఘనంగా పైడితల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ

ఘనంగా పైడితల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ పైడితల్లి అమ్మవారి నామస్మరణతో జువ్వలపాలెం గ్రామం మారుమోగింది. కాళ్ళ మండలం జువ్వలపాలెం గ్రామంలోని తూర్పుపేటలో భక్తులు, దాతలు, గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో నూతనంగా నిర్మించిన గ్రామదేవత పైడితల్లి అమ్మవారి ఆలయంలో విగ్రహం, ఆలయ శిఖర, జీవధ్వజ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు పుల్లేటికుర్తి గణపతిశర్మ బ్రహ్మత్వంలో గురువారం ఉదయం 9:30 నిమిషాలకు వేదమంత్రాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.నర్సాపురం పార్లమెంట్ మాజీ సభ్యుడు గోకరాజు గంగరాజు, టీడీపీ బోర్డు మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, జనసేన నాయకుడు చెనమల్ల చంద్రశేఖర్తో పాటు పలువురు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు

kolleru- కొల్లేరు సరస్సును సందర్శించండి – కామినేని శ్రీనివాస్

కొల్లేరు సరస్సును సందర్శించండి. గవర్నర్ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే కామినేని కొల్లేరు సరస్సులోని పక్షుల కేంద్రాన్ని సందర్శించాలని రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీరు ఆహ్వానించినట్లు కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలో గురువారం గవర్నర్ను కలసి ఆహ్వానించారు. ఈ నెల 17న నెల్లూరు స్వర్ణభారతీ ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో కూడా పాల్గొనాలని ఆహ్వానించారు. స్వర్ణభారతీ ట్రస్ట్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనకర్ కూడా హాజరవుతారని తెలిపారు.

చిట్టి దోసెలతో రోజుకు రూ.10 వేలు సంపాదిస్తున్న మహిళ, రుచి సూపర్ అంటూ కస్టమర్లు క్యూ-sri sathya sai district kutagulla village road side hotel woman making dosa earns 10k daily ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

నర్సమ్మ దోసెలు రుచిచూడాల్సిందే శ్రీ సత్యసాయి జిల్లా : కదిరికి సమీపంలోని కూటగుళ్ల గ్రామంలో నర్సమ్మ హోటల్ ఉంది. రోజుకు రూ.10 వేలు చొప్పున నెలకు దాదాపు రూ. 3 లక్షల వ్యాపారం జరుగుతుందని నర్సమ్మ తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారం సాఫీగా సాగుతుందని అంటున్నారు. నర్సమ్మ హోటల్ లో వివిధ రకాల దోసెలు విక్రయిస్తారు. ఎగ్ ఎగ్ దోసె రూ. 25 , సాధారణ దోసెలు రూ. 10 , కారం దోసెలు రూ.25 అందిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం వరకు అమ్మకాలు జరుగుతాయని నర్సమ్మ తెలిపారు. రోడ్డు పక్కనే కావడంతో వాహనదారులు, ప్రయాణికులు ఈ హోటల్ కు వస్తుంటారు. నర్సమ్మ హోటల్ దోసెల రుచి తెలిసిన స్థానిక కూలీలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు అక్కడకు నిత్యం వస్తుంటారు. తక్కువ ఖర్చు, రుచికి అమోఘంతో నర్సమ్మ దోసెల కోసం క్యూ కడుతుంటారు. ఈ హోటల్ లో ... Read more

పూర్తి స్థాయి నీటి మట్టానికి అడుగు దూరంలో శ్రీశైలం రిజర్వాయర్, సాగర్‌ వైపు కృష్ణమ్మ పరవళ్లు-srisailam reservoir a foot away from full water level krishnamma paravallu towards sagar ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

మంగళవారం రాత్రికి జూరాల నుంచి 2,81,196 క్యూసెక్కులు, తుంగభద్ర ద్వారా 1,07,246 క్యూసెక్కులతో కలిపి 3,88,442 క్యూసెక్కుల నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతున్నాయి. జలాశయ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215 టీఎంసీలుగా నమోదైంది. Telugu HindustanTimes

వాలంటీర్లపై వ్యాఖ్యల కేసులో పవన్ కల్యాణ్ ఊరట, విచారణపై స్టే విధించిన హైకోర్టు-ap high court stay order on deputy cm pawan kalyan volunteers comments case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వాలంటీర్లపై నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ప్రభుత్వంలో పవన్‌ కల్యాణ్ పై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని అప్పట్లో పవన్ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. Telugu HindustanTimes

ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కోణం, నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా?-amaravati ap liquor scam fake hologram sticker to liquor sales found in vigilance invention ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

నాసిరకం మద్యం ఏపీలో గత ఐదేళ్లుగా మద్యం వ్యాపారాన్ని నేరుగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. వైసీపీ హయాంలో మద్యం విక్రయాల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. మద్యం పాలసీలో అక్రమాల మాటటుంచితే గత ఐదేళ్లలో ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లను మాత్రమే జనం కొనాల్సి వచ్చేది. ఊరుపేరు లేని బ్రాండ్లతో పాటు దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో మాత్రమే విక్రయించేవారు. నాసిరకం మద్యం, డిస్టిలరీల్లో తయారై నేరుగా దుకాణాలకు చేరిపోయే మద్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా వైసీపీ ప్రభుత్వం వాటిని ఖాతరు చేయలేదు. సంపూర్ణ మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఐదేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేసింది. మద్యం ధరల్ని గణనీయంగా పెంచేసి విక్రయాలు జరిపారు. 2019మే నాటి ఉన్న ధరలతో పోలిస్తే 2024నాటికి అవి దాదాపు రెట్టింపు అయ్యాయి. Telugu HindustanTimes

Pulasa Fish : గోదారోళ్ల ఆతిథ్యమా మజాకా! ఖరీదైన పులస చేపతో విందు

Pulasa Fish : కోన‌సీమ జిల్లాల్లో ఖ‌రీదైన పుల‌స చేప‌తో ఏకంగా విందే పెట్టారు. ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పుస్తల‌మ్మి అయినా స‌రే పుల‌స చేప తినాల‌నే నానుడి ఉంది. ఆ పుల‌స చేప అంత ఖ‌రీదైన‌ది. అలాగే రుచి కూడా ఖ‌రీదుకు త‌గ్గట్టుగానే ఉంటుంది. Telugu HindustanTimes

Sharmila on Arogyrasri: ఏపీలో ఆరోగ్య శ్రీ ఉంటుందా,లేదా? స్పష్టత ఇవ్వాలన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల

Sharmila on Arogyrasri: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్డీఏ నేతల్ని ప్రశ్నించారు.  Telugu HindustanTtimes