Category: Andhra Pradesh

గంజాయికి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి – ముదినేపల్లిలో ర్యాలీ

గంజాయి రహిత గ్రామాలకై అందరూ కృషి చేయాలి – అంబుల. వైష్ణవి ముదినేపల్లి : గంజాయి రహిత గ్రామాలకై సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల. వైష్ణవి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని డాక్టర్లు, మందుల దుకాణాల యజమానులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బందితో కలిసి అంబుల వైష్ణవి, డా. మనోజ్ ల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగంపై రహదారుల వెంట ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో అంబుల వైష్ణవి, మనోజ్ లు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గంజాయికి దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు వంటి వాటిని దగ్గరకు రానీయకూడదన్నారు. అలాగే గ్రామంలో ఎవరైనా డ్రగ్స్ కు అలవాటు పడినవారు ఉంటే మానుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

putta Mahesh : ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించిన పొగాకు రైతులు.

పొగాకు రైతులకు జిల్లాలో 15 కోట్లు, రాష్ట్రంలో 110 కోట్లు లబ్ది ఏలూరు: ఇటీవల దేవరపల్లి లో జరిగిన పొగాకు రైతుల అవార్డుల వేడుకలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రైతులు వారి సమస్యలు చెప్పగా తక్షణం స్పందించిన ఎంపీ ఢిల్లీ లో కేంద్ర కామర్స్ మినిస్టర్ ను కలిసి రైతులు అదనంగా పండించిన పొగాకు పంట పై ఫెనాల్టీ రద్దు చేయాలని కోరారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం అదనంగా పండించిన పొగాకు పంటకు ఫెనాల్టీ రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది.ఈ సందర్బంగా జిల్లాలో పొగాకు పంట పండించిన రైతులు వందలాదిగా ఏలూరు వచ్చి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించారు.పొగాకు రైతు సంఘాల అద్యక్షులు పరిమి రాంబాబు, కరాటం రెడ్డి నాయుడు, కాకర్ల వివేకానంద లు మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి వలన జిల్లాలో ఉన్న 15 వేల మంది పొగాకు ... Read more

anam -కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తాము – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతులు పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. నెల్లూరు : కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సిజిఎఫ్ కింద 160 ఆలయాలు పున: నిర్మిస్తామని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు ఆలయ భూములు పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. 50వేల రూపాయలు కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థిక సాయం పెంచుతున్నట్లు ప్రకటించారు. తిరుమల నుంచే దేవాదాయ శాఖలో ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాలో ... Read more

పచ్చని కాపురంలో “మద్యం చిచ్చు” : ఒకరు ఉరి వేసుకొని, ఒకరు రైలు కింద పడి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న వైనం. అనాథలైన నెలల వయసున్న చిన్నారులు.

నెల్లూరు జిల్లా ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన కె నాగరాజు (23), సురేఖ(19) భార్యాభర్తలు. నాలుగేళ్ల కిందట ఇద్దరూ ప్రేమించి, వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్లు, 11 నెలల కుమారులు ఉన్నారు. నాగరాజు టైల్స్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేశాడు. సురేఖ మాగుంట లేఅవుట్‌లో ఓ బ్యూటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా చేస్తుంది. చక్కగా సాగుతున్న వీరి కాపురాన్ని మద్యం చిన్నాభిన్నం చేసింది. నాగరాజు తాగుడుకి బానిసై, సంపాదించిన డబ్బంతా మద్యానికి ఖర్చు చేసేవాడు. ఈ క్రమంలో పలుచోట్ల అప్పులు చేశాడు. దీంతో కుటుంబ భారం మొత్తం సురేఖపై పడింది. మద్యం మానేయాలని, అప్పులు చేయవద్దని సురేఖ భర్తను వేడుకుంది. తీరు మార్చుకోని నాగరాజు మద్యం అలవాటును మానుకోవడానికి బదులు పుట్టింటికి వెళ్లి మద్యానికి డబ్బు తీసుకురావాలని సురేఖను ఒత్తిడి చేయసాగాడు. ఆ క్రమంలో భార్యభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులతో విసిగిన సురేఖ శనివారం ఇంట్లోనే ... Read more

mohan ranga : రంగా పేరు పెట్టాలి అని కోరిన రాధా రంగా మిత్రమoడలి

హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ను కలిసి ఒక జిల్లాకి మోహన్ రంగా పేరు పెట్టాలని కోరిన రాధా రంగా మిత్రమండలి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లోని సైనిక్ స్కూల్ వద్ద రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ను కలిసి పుష్పగుచ్చం అందించిన రాధ రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పన్నాస పూర్ణచంద్రరావు (కాళపాలెం బుజ్జి) రాష్ట్రంలో ఒక జిల్లాకి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టేలా ప్రతిపాదన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాధా రంగా మిత్రమండలి నాయకులు పాల్గొన్నారు.

vehicles chek – mudinepalli police : వాహనాల తనిఖి

కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో ఏలూరు జిల్ల ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశానుసారం డిఎస్పీ డి. శ్రావణ కుమార్, కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కృష్ణా కుమార్ పర్యవేక్షణలో ఎస్సై డి. వెంకట్ కుమార్ తన సిబ్బందితో కలిసి ముదినేపల్లి ప్రధాన రహదారులపై వాహనాల తనిఖీ చేసి, వాహనం పత్రాలను పరిశీలించారు. పత్రాలు సరిలేని వాహనదారులకు జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా పత్రాలు సరిలేని వాహనాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకట్ కుమార్ హెచ్చరించారు.

tungabhadra – డ్యామ్‌ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తాం – పయ్యావుల కేశవ్ తుంగభద్ర డ్యామ్‌ ఘటనతో ఏపీ ప్రభుత్వం అలర్ట్డ్యామ్‌ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరాతుంగభద్ర డ్యామ్‌ అధికారులు, నిపుణులతో మాట్లాడాంవీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తాం – పయ్యావుల కేశవ్రాయలసీమ రైతులకు తుంగభద్ర డ్యామ్‌ జీవనాధారంసమస్యపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిందినీరు వృధాకాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాంప్రభుత్వం తరపున డ్యామ్ అధికారులకు సహకారం అందిస్తాం-మంత్రి పయ్యావుల కేశవ్

narsapur express – రైలులో దోపిడీ యత్నం

అందప్రదేశ్ – పల్నాడు జిల్లాలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీ యత్నం చేసిన దుండగులు.. రైలుపై రాళ్లు రువ్విన దుండగులు అనంతరం, B1, S11, S12 కోచ్లోకి ప్రవేశించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసారు.. ప్రయాణికులు కోచ్లకి డోర్లు వేయడంతో లోపలికి వెళ్లలేకపోయిన దొంగలు.. దోపిడీ యత్నంపై రైల్వే పోలీసుల దర్యాప్తు..