Category: కోస్తా ఆంధ్రా
ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యo ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్.
ప్రజా సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి చంద్ర బాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్ అన్నారు. తోటగూడెంలో గురువారం జరిగిన మీ కోసం – మీ చింతమనేని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామసభ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని, వారి నుంచి వినతులు స్వీకరించారు. తాగు, సాగు నీరు, గ్రామాల్లో పారిశుధ్యం, డ్రెయిన్ల మరమ్మతు, అంతర్గత రహ దారులు అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందజేస్తామన్నారు. గ్రామసభ ద్వారా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కా రానికి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఉప్పలపాటి రామ్‌ప్రసాద్, గుత్తా అనిల్, లావేటి శ్రీనివాసరావు, పెద్ది రమేష్, కంభంపాటి సునీల్‌కుమార్, దండమూడి సీతారాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పైడితల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ
ఘనంగా పైడితల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ పైడితల్లి అమ్మవారి నామస్మరణతో జువ్వలపాలెం గ్రామం మారుమోగింది. కాళ్ళ మండలం జువ్వలపాలెం గ్రామంలోని తూర్పుపేటలో భక్తులు, దాతలు, గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో నూతనంగా నిర్మించిన గ్రామదేవత పైడితల్లి అమ్మవారి ఆలయంలో విగ్రహం, ఆలయ శిఖర, జీవధ్వజ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు పుల్లేటికుర్తి గణపతిశర్మ బ్రహ్మత్వంలో గురువారం ఉదయం 9:30 నిమిషాలకు వేదమంత్రాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.నర్సాపురం పార్లమెంట్ మాజీ సభ్యుడు గోకరాజు గంగరాజు, టీడీపీ బోర్డు మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, జనసేన నాయకుడు చెనమల్ల చంద్రశేఖర్తో పాటు పలువురు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు
kolleru- కొల్లేరు సరస్సును సందర్శించండి – కామినేని శ్రీనివాస్
కొల్లేరు సరస్సును సందర్శించండి. గవర్నర్ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే కామినేని కొల్లేరు సరస్సులోని పక్షుల కేంద్రాన్ని సందర్శించాలని రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీరు ఆహ్వానించినట్లు కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలో గురువారం గవర్నర్ను కలసి ఆహ్వానించారు. ఈ నెల 17న నెల్లూరు స్వర్ణభారతీ ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో కూడా పాల్గొనాలని ఆహ్వానించారు. స్వర్ణభారతీ ట్రస్ట్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనకర్ కూడా హాజరవుతారని తెలిపారు.