Category: కోస్తా ఆంధ్రా
mohan ranga : రంగా పేరు పెట్టాలి అని కోరిన రాధా రంగా మిత్రమoడలి
హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ను కలిసి ఒక జిల్లాకి మోహన్ రంగా పేరు పెట్టాలని కోరిన రాధా రంగా మిత్రమండలి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లోని సైనిక్ స్కూల్ వద్ద రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ను కలిసి పుష్పగుచ్చం అందించిన రాధ రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పన్నాస పూర్ణచంద్రరావు (కాళపాలెం బుజ్జి) రాష్ట్రంలో ఒక జిల్లాకి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టేలా ప్రతిపాదన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాధా రంగా మిత్రమండలి నాయకులు పాల్గొన్నారు.
vehicles chek – mudinepalli police : వాహనాల తనిఖి
కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో ఏలూరు జిల్ల ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశానుసారం డిఎస్పీ డి. శ్రావణ కుమార్, కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కృష్ణా కుమార్ పర్యవేక్షణలో ఎస్సై డి. వెంకట్ కుమార్ తన సిబ్బందితో కలిసి ముదినేపల్లి ప్రధాన రహదారులపై వాహనాల తనిఖీ చేసి, వాహనం పత్రాలను పరిశీలించారు. పత్రాలు సరిలేని వాహనదారులకు జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా పత్రాలు సరిలేని వాహనాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకట్ కుమార్ హెచ్చరించారు.
narsapur express – రైలులో దోపిడీ యత్నం
అందప్రదేశ్ – పల్నాడు జిల్లాలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీ యత్నం చేసిన దుండగులు.. రైలుపై రాళ్లు రువ్విన దుండగులు అనంతరం, B1, S11, S12 కోచ్లోకి ప్రవేశించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసారు.. ప్రయాణికులు కోచ్లకి డోర్లు వేయడంతో లోపలికి వెళ్లలేకపోయిన దొంగలు.. దోపిడీ యత్నంపై రైల్వే పోలీసుల దర్యాప్తు..
Kaikaluru – 53వ రోజుకు చేరిన అన్నా క్యాంటిన్..
కైకలూరు నియోజకవర్గం లో 53వ రోజు అన్నా క్యాంటిన్ నిర్వహణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలు మేరకు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 53 రోజుకు చేరింది. శనివారం అన్నదాతగా ఆవకూరు గ్రామస్తులు మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమల శెట్టి రామాంజనేయులు సతీమణి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు 400 మందికి అన్నదానం అందించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబీ), తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పులా రాజి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలు మేరకు దాతల సహాయం ... Read more
Kaikaluru – పట్టణ ఇన్స్పెక్టర్ ను కలిసినన ఎన్డీఏ కూటమి నాయకులు.
కైకలూరు పట్టణ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పి కృష్ణా ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించిన తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పూల రామచంద్రరావు(రాజి), జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబి), జనసేన నాయకులు తులసి పూర్ణ, ఘంటశాల చందు, తదితరులు.
kaikaluru – చంద్రబాబు కటౌట్ కు పాలాభిషేకం.
కైకలూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చిత్రపటం (కటౌట్) కు పాలాభిషేకం చేసిన అర్చకులు. ప్రైవేటు దేవస్థానములో ధూపదీప నైవేద్యాలు సమర్పించేందుకు ప్రతినెలా పదివేల రూపాయలు ప్రభుత్వం నుండి అర్చకులకు అందేలా జీవో విడుదల చేయడంతో చంద్రబాబు కటౌట్ కు పాలాభిషేకం చేసిన అర్చకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దైవం అండగా ఉండాలని అర్చకులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యమ్ ఎ రహీమ్, కె కె బాబు, వీరాబత్తిన సుధ, పి రాధాకృష్ణ, లక్కింశెట్టి మోహన్, సదర్ల సూరి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
venkayya naidu: రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి..
బాపట్ల – ఏపీ రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రతో మ్యూజియం ఏర్పాటు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. మహనీయుల జీవిత చరిత్రలు నేటి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జాగర్లమూడిలో మాజీ ఎమ్మెల్యే కుప్పుస్వామి చౌదరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయనకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చీరాల రైల్వేస్టేషన్‌లో ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వెంకయ్య నాయుడు కుప్పుస్వామి చౌదరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు.
గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో భార్య భర్తలు మృతి : తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం మండలంలో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభ వించడంతో గాయాలపాలైన కుటుంబం తాడేపల్లిగూడెం ఏరియా ఆసు పత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్య, భర్తలు గురువారం మృతి చెందారు. తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారంలోని టిడ్‌కో ఇళ్ల వద్ద మంగళవారం ఉదయం గ్యాస్ బండ పేలిన ఘటనలో భార్య భర్తలు బోడపాడు మురళి (37), బోడపాడు కుమారి (34), కుమార్తె నీలిమలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో వారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మురళి, కుమారిలు గురువారం మృతి చెందారు. నీలిమకు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రమేష్ వివరించారు.