Category: కోస్తా ఆంధ్రా

AllAlerts : మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్… ఫోక్సో కేసు నమోదు

మైనర్ బాలిక ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మించి అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిపై కైకలూరు టౌన్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి 24 గంటల్లో అరెస్ట్ చేసినట్టు కైకలూరు టౌన్ ఎస్ఐ డి. వెంకట్ కుమార్ శనివారం ఒక ప్రకటనద్వారా తెలిపారు. ఎస్సై వెంకట్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం… కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను కైకలూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన సుగుణరావు అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా.. సదరు బాలిక భయంతో కేకలు వేసింది. దీంతో నిందితుడు సుగుణరావు అక్కడి నుండి పారిపోయాడు. విషయాన్ని సదరు బాలిక సాయంత్రం ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. ఈ ఘటనపై బాలిక తండ్రి శుక్రవారం రాత్రి కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. సదరు రిపోర్టుపై కైకలూరు టౌన్ ఎస్సై ... Read more

గుడివాడ : దీపం-2 పథక లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందచేసిన నాయకులు

దీపం-2 పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని కూటమి పార్టీల నాయకులు పేర్కొన్నారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని విజయ గ్యాస్ ఏజెన్సీలో కూటమి పార్టీల నేతలతో కలిసి…మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, కృష్ణా జిల్లా బిజెపి అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజబాబు దీపం-2 పథక లబ్ధిదారులకు.. ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా.. సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. అబద్దాలపై పాలన చేసిన వైకాపా… ఇప్పటికీ బుద్ధి మార్చుకోక ఆకాశంపైకి ఉమ్మి వేసినట్లు సామాజిక మాధ్యమాల్లో… కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసే కూటమి ప్రభుత్వంపై వైకాపా సైకోలు చేసే ప్రచారాన్ని ప్రజలెవరు విశ్వసించరని బుద్ధి ... Read more

Kaikaluru Tizola : టిజోల ఫుడ్ డెలివరీ యాప్ ప్రారంభించిన కమ్మిలి విఠల్ రావు.

కైకలూరు టిజోల (tizola) యాప్ నిర్వాహుకులు బృందావనంలోని కమ్మిలి విఠల్ రావు నివాసం వద్ద యాప్ మాజీ శాసనసభ్యులు విఠల్ రావు తో ప్రారంభోత్సవం నిర్వహించారు. యాప్ అధినేత బి. సురేష్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో యాప్ ప్రాచుర్యం పొందిందని, కైకలూరు పట్టణ పరిధిలోని ఐదు కిలోమీటర్ల వరకు ఉ 7గం నుండి రాత్రి 10గం వరకు కైకలూరులోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటల్స్, స్వీట్ షాప్స్, నుండి ఫుడ్, టిఫిన్, స్నాక్స్ వంటివి డెలివరీ సౌకర్యం అందిస్తామని తెలిపారు. కైకలూరు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఫుడ్ డోర్ డెలివరీ అందిస్తున్న ఈ యాప్ వాడుకోవాలని కమ్మిలి విఠల్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్రాంచైజీ పంతగాని రాము, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి పూల రాజీ, మంగినేని రామకృష్ణ, కేకే బాబు, అన్నం రాంబాబు, డి రామస్వామి, ఎన్ సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Denduluru : వకరిపై వకరు దాడి చేసుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు.

వకరిపై వకరు దాడి చేసుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పైడిచింతపాడు గ్రామంలో నవంబర్ నెల వృద్దాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘర్షణలో పలువురికి గాయలవ్వగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

Nandigama : దీపం పథకం గ్యాస్ సిలిండర్లను అందజేసిన శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య

ఇంటికి దీపం ఇల్లాలు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మహిళా పక్షపాతి , ఆంధ్ర రాష్ట్రానికి చీకట్లు పోయి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే దీపావళి పండుగ వచ్చేసింది – ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య నందిగామ పట్టణం పాత బస్టాండ్ బాబు జగజీవన్ రామ్ ఫంక్షన్ హాల్ నందు శుక్రవారం నాడు అధికారులు మరియు ఎన్డీఏ కూటమినేతలతో కలిసి దీపం పథకం – 2 ను ప్రారంభించి లబ్ధిదారులకు ఉచితముగా మూడు గ్యాస్ సిలిండర్లను అందజేసిన శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను చూడగానే చాలా సంతోషం కలిగింది ఏ విషయమైనా ఉపాధ్యాయులు చాలా స్పష్టముగా వివరించగలరు. దేశమంతటా దీపావళి నిన్న వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ముందుగానే వచ్చేసింది కూటమి ప్రభుత్వ హామీలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఉచితముగా మూడు గ్యాస్ సిలిండర్లను ప్రకటించిన నాడే దీపావళి పండుగ వచ్చేసింది. అధికారంలోకి రాగానే ... Read more

AndhraPradesh : దీపం-2 పథకం ప్రారంభం. స్వయంగా టీ తయారు చేసిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్లో దీపం-2 పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. స్వయంగా టీ తయారుచేశారు. సీఎం చంద్రబాబు దీపం-2 పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనతరం అంబటి శాంతమ్మ అనే మహిళ ఇంటికెళ్లి ఉచిత సిలిండర్ కనెక్షన్ బిగించి స్టవ్ పై పాలు మరిగించారు. చంద్రబాబు స్వయంగా టీ తయారు చేశారు. మహిళ కుటుంబసభ్యులతో కలిసి టీ తాగారు. సీఎం వెంట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

AllAlerts : ఏలూరు ఉల్లిపాయబాంబ్ లు పేలిన ఘటనలో ఒకరు సంఘటన స్థలంవద్దే మృతి

ఏలూరు – దీపావళి పండుగ (Diwali) వేళ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. Eluru బాణాసంచా పేలిన ఘటనలో ఒకరు సంఘటన స్థలంవద్దే మృతి చెందారు. బైక్‌పై బాణాసంచాను తీసుకెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు అక్కడి ప్రజలు. కొద్ది సేపటి తరువాత బాణాసంచా పేలిందని తెలియడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుంతోంది. తాజాగా.. ఏలూరులో సుధాకర్ అనే వ్యక్తి బాణాసంచాను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఏలూరు తూర్పువీధి సెంటర్ వద్ద ఒక్కసారిగా ఆయన తీసుకెళ్తున్న బాణాసంచా పేలింది. దాంతో ఒక్కసారిగా పెనువిస్పోటనం సంభవించింది. బాణాసంచాను తీసుకెళ్తున్న సుధాకర్ పేలుడు ధాటికి రెండు ముక్కలయ్యాడు. సగబాగం చిందరవందరగా చుట్టుపక్కల పడ్డాయి. అలాగే అతని ... Read more

Chintalapoodi : జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అభివృద్ధికి తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే రోషన్ కుమార్

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రాగునీరు, రహదారుల అభివృద్ధి పనులకు 4.65 కోట్లతో ప్రతిపాదనలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో త్రాగు నీరు, రహదారి సమస్యలకు చెక్ పెట్టేందుకు 4.65 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. ఈ మేరకు ఈనెల 29వ తేదీన ఉదయం జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించనుంది. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ముందుగా గౌరవ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కు మున్సిపల్ కమిషనర్ కొమ్మనేని వెంకటరమణ వివరించారు. నియోజవర్గంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఆదాయం పెంచడం , వాటి పనితీరు మెరుగుపరచడం ద్వారా మరింత అభివృద్ధికి తోడ్పడుతామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి పట్టణ సుందరీకరణకు కోసం నిధులు మంజూరుకు కృషి చేస్తామని రోషన్ కుమార్ ఈ సందర్భంగా కమిషనర్ కు ... Read more