Category: కోస్తా ఆంధ్రా
Denduluru : అయ్యప్ప , భవాని మాల దీక్షాదారులకు అల్పాహారం – దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
అయ్యప్ప , భవాని మాల దీక్షాదారులకు ప్రతి రోజూ వడై (అల్పాహారం) ఏర్పాటు చేస్తున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా చింతమనేని ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయిన ఆయన చేస్తున్న ప్రజా సేవా కార్యక్రమాలు మాత్రం ఏ రోజు ఆగకపోవటం చింతమనేని ప్రభాకర్ కార్యదక్షతకి నిదర్శనం అని చెప్పవచ్చు. కొవిడ్ విలయ తాండవం చేస్తున్న సమయంలో సైతం కొవిడ్ కేంద్రాల వద్ద పేషంట్లు బంధువులకు, అలాగే లాక్ డౌన్ టైమ్ లో హైవే పై ప్రయాణించే ప్రయాణికులకు లారీ డ్రైవర్లకు కూడా ఆహారాన్ని అందించారు చింతమనేని ప్రభాకర్. దుగ్గిరాల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిత్యం జరుగుతున్న స్వాములకు, భవానీలకు వడై (అల్పాహార) కార్యక్రమాలను సోమవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పర్యవేక్షించి, స్వాములు భవానీలతో కలిసి వడై స్వీకరించారు. ప్రతి నిత్యం వడై కోసం ... Read more
Allalerts : విగ్రహా ఆవిష్కరణలో విషాదం నలుగురు మృతి.
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. గత సంవత్సర కాలంగా ఎన్నో వివాదాల నడుమ ఉన్న పాపన్న గౌడ్ విగ్రహా ఆవిష్కరణ నేడు పరిష్కారమై విగ్రహావిష్కరణకు నోచుకున్న వేళ ఈ సంఘటన జరగటం విచారకరం. ఎంతో ఆనందంతో గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సోమవారం విగ్రహావిష్కరణ ఏర్పాట్లు జరుగుతున్న వేళ విషాదం జరిగింది. విగ్రహావిష్కరణలో భాగంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంటు షాక్ కు గురై నలుగురు వ్యక్తులు మృతి చెందారు. బొల్లా వీర్రాజు, పామర్తి నాగేంద్ర, మారిశెట్టి మణికంఠ, కాసగాని కృష్ణ మృతి. మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. తీవ్ర గాయాల పాలైన కోమటి అనంతరావు తణుకు ఏరియా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఉండ్రాజవరం పోలీసులు.
Crime Prakasam : విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.
నెల రోజులుగా విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ట్యూషన్ మాస్టర్ పై విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు.ప్రకాశం జిల్లాలో విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వేటపాలెం మండలంలో చోటు చేసుకుంది. ట్యూషన్కు వెళ్లిన విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం. వెంకటేశ్వర్లు ఆదివారం మీడియాకి తెలిపారు.
Palakollu : నేడు టిడ్కో గృహవాసులకు ఉచిత కొత్త వాహనం ప్రారంభం
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లోని టిడ్కో గృహాల కాలనీవాసులకు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుపుతున్న వాహనాన్ని ఈరోజు ఆదివారం ప్రారంభించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కాలనీవాసులు వివిధ పనుల నిమిత్తం గాంధీ బొమ్మల సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే దూరం కావడంతో ఎటువంటి వాహనాలు లేక ముఖ్యంగా మహిళలు నడిచి వెళ్ళవలసి వచ్చేది. వీరి పరిస్థితిని అర్థం చేసుకున్న మన మంత్రి నిమ్మల రామానాయుడు ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న హయాంలోనే ఉచిత ప్రయాణ వాహనాన్ని ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఆ ప్రాంతవాసులు ఉదయం నుంచి రాత్రి వరకు ఉచిత వాహనంలో రాకపోకలు సాగిస్తున్నారు. ఆ వాహనం కొంత పాతది కావడంతో అన్ని సౌకర్యాలతో మరో కొత్త వాహనాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరొకటి కొనుగోలు చేసి ఆ ప్రాంత వాసుల కోసం సిద్ధం చేశారు. కాలనీవాసులకు ప్రత్యేకంగా ఉచిత వాహనాన్ని ... Read more
మంగళగిరి : అక్రమంగా గోవులు తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు – రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్
గోవులను సురక్షితంగా నరసింహస్వామి వారి గోశాలకు తరలింపు మంగళగిరి హైవే పై తెల్లవారుజామున గోవులను ఎలాంటి సంరక్షణ చర్యలు చేపట్టకుండా గోవులను ఇబ్బంది పెట్టే విధంగా వాహనంలో తరలిస్తుండగా వారిని అదుపులోనికి తీసుకొని గోవులను సంరక్షణ నిమిత్తం మంగళగిరి పట్టణానికి చెందిన నరసింహ స్వామి ఆలయ గోశాలకు తరలింపు. దీనికి ఆలయ కమిటీ గోశాల నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన రూరల్ ఎస్సై వెంకట్. నైట్ డ్యూటీ చేసిన, విధి నిర్వహణలో ఈ చట్ట విరుద్ధ కార్యకలాపానికి నివారణలో భాగంగా తన డ్యూటీ నిర్వహించిన హోంగార్డ్ బుజ్జిని అభినందించారు. వాటిని తరలించే క్రమంలో కొందరు ప్రజానీకం వాటిని గమనించి వాటి పరిశీల నిమిత్తం కొన్ని సూచనలు చేయడం జరిగింది. గోవులు తరలించే విషయంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం. ఎలాంటి సందేహాలు లేదు. దీనిపై ఎలాంటి వివాదాలు గానీ ఎవరు కూడా ఎలాంటి భావాజాలతో వివాదాస్పదమైన వ్యాఖ్యలతో ఉండరాదని మంగళగిరి రూరల్ ... Read more
వైయస్ఆర్ సీపి : ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా దేవినేని అవినాష్ పదవి బాధ్యత స్వీకార సభ
అమ్మఒడి, రైతు భరోసా పధకాలు కనుమరుగయ్యాయి, దీపం పధకం నీరుగారిపోయింది – వెలంపల్లి శ్రీనివాసరావు. విజయవాడ బందరు రోడ్ లోని శేష సాయి కళ్యాణ మండపం నందు ఆదివారం నాడు వైభవంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా దేవినేని అవినాష్ పదవి బాధ్యత స్వీకార మహోత్సవం మరియు జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధులుగా పాల్గొన్న రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, PAC మెంబర్, పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, కృష్ణ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పేర్ని నాని, సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు, నందిగామ ఇంచార్జ్ మొండితోక జగన్ మోహనరావు, తిరువూరు ఇంచార్జ్ నలగట్ల స్వామిదాస్, జగయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు తదితర వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ... Read more
ఏలూరు : ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘దీపం-2’ కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్
సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ను ప్రారంభిస్తున్న – సనాతన ధర్మం కోసం పార్టీలో ప్రత్యేక వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు చెప్పిన : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక – మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – సనాతన ధర్మాన్ని కాపాడేందుకు జనసేనలో ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, కానీ తన విశ్వాసాలపై నిలబడతానని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, సనాతన ధర్మాన్ని అగౌరవపరిచేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పార్టీలో ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. శనివారం ఏలూరులోని జగన్నాథపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ... Read more
Avanigadda : లా అండ్ ఆర్డర్ సమస్యలకు కారకులయ్యే వారిని సహించేది లేదు – అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్
ఫ్లెక్సీలు, సోషల్ మీడియా పోస్టులతో లా అండ్ ఆర్డర్ సమస్యలకు కారకులయ్యే వారిని సహించేది లేదు :అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ శనివారం అవనిగడ్డ పోలీస్ స్టేషనులో ఆయన మీడియాతో మాట్లాడుతూ .. ఫ్లెక్సీల ఏర్పాటుకు పంచాయతీ, విద్యుత్ శాఖల అనుమతి తీసుకోవాలన్నారు. ఇతరుల, సమూహాల, వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా ఫ్లెక్సీలు వేయిస్తే వాటిని తయారు చేయించే వారితో పాటు, ముద్రించే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా వేడుకలకు అనుమతి తీసుకొని ఏర్పాటు చేసుకునే ఫ్లెక్సీలు సందర్భం పూర్తి కాగానే తొలగించాలని స్పష్టం చేశారు. సమస్యలు సృష్టించే ప్రదేశాల్లో ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వవద్దని ఇప్పటికే సంబంధిత శాఖలకు లేఖలు రాసినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పదేపదే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై చట్టపరంగా రౌడీషీట్లు కూడా ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అవనిగడ్డ సర్కిల్ ... Read more