Category: ఏలూరుజిల్లా

Kaikaluru – పట్టణ ఇన్స్పెక్టర్ ను కలిసినన ఎన్డీఏ కూటమి నాయకులు.

కైకలూరు పట్టణ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పి కృష్ణా ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించిన తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పూల రామచంద్రరావు(రాజి), జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబి), జనసేన నాయకులు తులసి పూర్ణ, ఘంటశాల చందు, తదితరులు.

kaikaluru – చంద్రబాబు కటౌట్ కు పాలాభిషేకం.

కైకలూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చిత్రపటం (కటౌట్) కు పాలాభిషేకం చేసిన అర్చకులు. ప్రైవేటు దేవస్థానములో ధూపదీప నైవేద్యాలు సమర్పించేందుకు ప్రతినెలా పదివేల రూపాయలు ప్రభుత్వం నుండి అర్చకులకు అందేలా జీవో విడుదల చేయడంతో చంద్రబాబు కటౌట్ కు పాలాభిషేకం చేసిన అర్చకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దైవం అండగా ఉండాలని అర్చకులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యమ్ ఎ రహీమ్, కె కె బాబు, వీరాబత్తిన సుధ, పి రాధాకృష్ణ, లక్కింశెట్టి మోహన్, సదర్ల సూరి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యo ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్‌.

ప్రజా సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి చంద్ర బాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్‌ అన్నారు. తోటగూడెంలో గురువారం జరిగిన మీ కోసం – మీ చింతమనేని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామసభ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని, వారి నుంచి వినతులు స్వీకరించారు. తాగు, సాగు నీరు, గ్రామాల్లో పారిశుధ్యం, డ్రెయిన్ల మరమ్మతు, అంతర్గత రహ దారులు అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందజేస్తామన్నారు. గ్రామసభ ద్వారా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కా రానికి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఉప్పలపాటి రామ్‌ప్రసాద్‌, గుత్తా అనిల్‌, లావేటి శ్రీనివాసరావు, పెద్ది రమేష్‌, కంభంపాటి సునీల్‌కుమార్‌, దండమూడి సీతారాం ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

kolleru- కొల్లేరు సరస్సును సందర్శించండి – కామినేని శ్రీనివాస్

కొల్లేరు సరస్సును సందర్శించండి. గవర్నర్ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే కామినేని కొల్లేరు సరస్సులోని పక్షుల కేంద్రాన్ని సందర్శించాలని రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీరు ఆహ్వానించినట్లు కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలో గురువారం గవర్నర్ను కలసి ఆహ్వానించారు. ఈ నెల 17న నెల్లూరు స్వర్ణభారతీ ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో కూడా పాల్గొనాలని ఆహ్వానించారు. స్వర్ణభారతీ ట్రస్ట్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనకర్ కూడా హాజరవుతారని తెలిపారు.