Category: ఏలూరుజిల్లా

ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు డా” కామినేని శ్రీనివాస్

ఏలూరుజిల్లా మండవల్లి మండలం మండవల్లి లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు డా” కామినేని శ్రీనివాస్. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పధకాలను సద్వినియోగం చేసుకోవాలని, కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువు, క్రమశిక్షణతో మెలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

నాలుగు బైక్స్ రికవరీ ఇద్దరు అరెస్ట్ – ముదినేపల్లి

ముదినేపల్లి మండలంలో వరుస బైక్ దొంగతనాలు జరగడంతో! ముదినేపల్లి ఎస్సై డి. వెంకట్ కుమార్ తన సిబ్బందితో కలిసి ప్రత్యేక నిఘాతో జల్లూరి మణికంఠ, కొట్టి సాయిరామ్ అనే ఇద్దరుని అరెస్టు చేసి వీరి వద్దనుండి నాలుగు బైక్స్, రెండు ట్రాక్టర్ చక్రాలను స్వాదీన పరుచుకున్నారు. నిందితులను కైకలూరు కోర్టుకు తరలించిన పోలీసులు.

bangladesh – బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు అరికట్టాలి

బంగ్లాదేశ్ లో ఇటీవల కాలంలో చెలరేగిన హింసకాండలో హిందువులపై దాడులు ఎక్కువయ్యాయని వాటిని అరికట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందువులపై దాడికి వ్యతిరేకంగా కైకలూరు కలిదిండి గ్రామాల్లో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కైకలూరులో శ్రీ శ్యామలాంబ ఆలయం వద్ద నుండి హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తాలూకా సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో పెద్ద ఎత్తున హిందువులు పాల్గొని బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముస్లిం దేశాలలో హిందువులపై దాడులు తరచూ జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు. అల్ప సంఖ్యలో ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని వాపోయారు. ప్రపంచదేశాల్లో ఉన్న హిందువులందరికీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక తాలూకా సెంటర్లో మానవహారం గా ఏర్పడ్డారు. కార్యక్రమంలో కీర్తి వెంకట రాంప్రసాద్ ... Read more

andhra- రైతులకు ఉచితంగానే పంటల బీమా..

పౌరసరఫరాల రుణాల్లో వచ్చే ఏడాది 10వేల కోట్ల రూపాయలు చెల్లిస్తామని ప్రకటన – నాదెండ్ల మనోహర్ ఏలూరు – వచ్చే ఖరీఫ్ నుండి ధాన్యం కొనుగోళ్లకు సంబందించి 48 గంటల్లోనే రైతుల ఖాతాలకు నగదు జమ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అలాగే ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు పంటల బీమా ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరులోని సీఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో సోమవారం.. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు చెల్లించాల్సిన రూ.472 కోట్లు ? ధాన్యం బకాయిలను విడుదల చేస్తూ చెక్కులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. “సివిల్ సప్లయిస్ పేరిట గత వైసీపీ ప్రభుత్వం రూ.40,500 కోట్ల రుణాలు తీసుకుంది. రైతులను సంక్షోభంలోకి నెట్టివేసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు కూడా పంచకుండా ఇబ్బంది పెట్టారు. ... Read more

గంజాయికి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి – ముదినేపల్లిలో ర్యాలీ

గంజాయి రహిత గ్రామాలకై అందరూ కృషి చేయాలి – అంబుల. వైష్ణవి ముదినేపల్లి : గంజాయి రహిత గ్రామాలకై సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల. వైష్ణవి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని డాక్టర్లు, మందుల దుకాణాల యజమానులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బందితో కలిసి అంబుల వైష్ణవి, డా. మనోజ్ ల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగంపై రహదారుల వెంట ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో అంబుల వైష్ణవి, మనోజ్ లు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గంజాయికి దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు వంటి వాటిని దగ్గరకు రానీయకూడదన్నారు. అలాగే గ్రామంలో ఎవరైనా డ్రగ్స్ కు అలవాటు పడినవారు ఉంటే మానుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

putta Mahesh : ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించిన పొగాకు రైతులు.

పొగాకు రైతులకు జిల్లాలో 15 కోట్లు, రాష్ట్రంలో 110 కోట్లు లబ్ది ఏలూరు: ఇటీవల దేవరపల్లి లో జరిగిన పొగాకు రైతుల అవార్డుల వేడుకలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రైతులు వారి సమస్యలు చెప్పగా తక్షణం స్పందించిన ఎంపీ ఢిల్లీ లో కేంద్ర కామర్స్ మినిస్టర్ ను కలిసి రైతులు అదనంగా పండించిన పొగాకు పంట పై ఫెనాల్టీ రద్దు చేయాలని కోరారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం అదనంగా పండించిన పొగాకు పంటకు ఫెనాల్టీ రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది.ఈ సందర్బంగా జిల్లాలో పొగాకు పంట పండించిన రైతులు వందలాదిగా ఏలూరు వచ్చి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించారు.పొగాకు రైతు సంఘాల అద్యక్షులు పరిమి రాంబాబు, కరాటం రెడ్డి నాయుడు, కాకర్ల వివేకానంద లు మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి వలన జిల్లాలో ఉన్న 15 వేల మంది పొగాకు ... Read more

mohan ranga : రంగా పేరు పెట్టాలి అని కోరిన రాధా రంగా మిత్రమoడలి

హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ను కలిసి ఒక జిల్లాకి మోహన్ రంగా పేరు పెట్టాలని కోరిన రాధా రంగా మిత్రమండలి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లోని సైనిక్ స్కూల్ వద్ద రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ను కలిసి పుష్పగుచ్చం అందించిన రాధ రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పన్నాస పూర్ణచంద్రరావు (కాళపాలెం బుజ్జి) రాష్ట్రంలో ఒక జిల్లాకి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టేలా ప్రతిపాదన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాధా రంగా మిత్రమండలి నాయకులు పాల్గొన్నారు.

vehicles chek – mudinepalli police : వాహనాల తనిఖి

కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో ఏలూరు జిల్ల ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశానుసారం డిఎస్పీ డి. శ్రావణ కుమార్, కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కృష్ణా కుమార్ పర్యవేక్షణలో ఎస్సై డి. వెంకట్ కుమార్ తన సిబ్బందితో కలిసి ముదినేపల్లి ప్రధాన రహదారులపై వాహనాల తనిఖీ చేసి, వాహనం పత్రాలను పరిశీలించారు. పత్రాలు సరిలేని వాహనదారులకు జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా పత్రాలు సరిలేని వాహనాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకట్ కుమార్ హెచ్చరించారు.