Category: ఏలూరుజిల్లా

Kaikaluru : ఉత్తిర్ణత సాధించిన పదవ తరగతి విద్యార్థులకు లాప్టాప్ లు అందించిన కామినేని శ్రీనివాస్.

ఏలూరుజిల్లా ముదినేపల్లి మండలం ముదినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 550 పైన ఉత్తిర్ణత సాధించిన 11 మంది విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఎన్నారైలు దొడ్డపనేని బాబురావు, రామకృష్ణ ఆర్ధిక సహకారంతో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ 11 మంది విద్యార్థులకు లాప్టాప్లు వీటితో పాటు రూ.5000/- (అయిదు వేల రూపాయిలు) నగదును అందజేశారు. ఈ సందర్బంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ దాతలు ఈ విధంగా విద్యార్థులను ప్రోత్సహించటం చాలా సంతోషకారంగా ఉందని, విద్యార్థులు ఇలాంటి బహుమతులు మరెన్నో అందుకుని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బట్టలు, మొదలుగునవి బహుకరించటం చూసాం కానీ లాప్టాప్ లు బహుమతిగా అందించడం చాలా ఆనందదాయకం అని కొనియాడారు. వీటిని మంచిగా ఉపయోగించుకుని మంచి మార్గంలో ప్రయాణించాలని కన్న వారికీ, చదువు నేర్పిన గురువులకు, వున్న ఊరికి మంచి పేరు తేవాలని విద్యార్థులను కోరారు. ఈ ... Read more

Polavaram : కార్తీకమాస వన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.

కార్తీకమాసం ప్రతి సంవత్సరం జరిగే వనభోజనాల కార్యక్రమం పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. వనభోజనాల కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు ప్రజలతో సరదాగా గడిపారు ప్రజలతో కలిసి కార్తీకమాస వనభోజనాలను స్వీకరించారు.ఎమ్మెల్యే బాలరాజు తో పోలవరం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ గారు జనసేన పార్టీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటంసాయి పాల్గొన్నారు. ముందుగా పోలవరం జనసేన పార్టీ మండల నాయకులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యేను భారీ ర్యాలీతో డప్పు వాయిద్యాలతో తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో పోలవరం మండలంలో కూటమి నాయకులు జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Denduluru : అయ్యప్ప , భవాని మాల దీక్షాదారులకు అల్పాహారం – దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

అయ్యప్ప , భవాని మాల దీక్షాదారులకు ప్రతి రోజూ వడై (అల్పాహారం) ఏర్పాటు చేస్తున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా చింతమనేని ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయిన ఆయన చేస్తున్న ప్రజా సేవా కార్యక్రమాలు మాత్రం ఏ రోజు ఆగకపోవటం చింతమనేని ప్రభాకర్ కార్యదక్షతకి నిదర్శనం అని చెప్పవచ్చు. కొవిడ్ విలయ తాండవం చేస్తున్న సమయంలో సైతం కొవిడ్ కేంద్రాల వద్ద పేషంట్లు బంధువులకు, అలాగే లాక్ డౌన్ టైమ్ లో హైవే పై ప్రయాణించే ప్రయాణికులకు లారీ డ్రైవర్లకు కూడా ఆహారాన్ని అందించారు చింతమనేని ప్రభాకర్. దుగ్గిరాల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిత్యం జరుగుతున్న స్వాములకు, భవానీలకు వడై (అల్పాహార) కార్యక్రమాలను సోమవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పర్యవేక్షించి, స్వాములు భవానీలతో కలిసి వడై స్వీకరించారు. ప్రతి నిత్యం వడై కోసం ... Read more

ఏలూరు : ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘దీపం-2’ కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ను ప్రారంభిస్తున్న – సనాతన ధర్మం కోసం పార్టీలో ప్రత్యేక వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు చెప్పిన : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక – మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – సనాతన ధర్మాన్ని కాపాడేందుకు జనసేనలో ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, కానీ తన విశ్వాసాలపై నిలబడతానని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, సనాతన ధర్మాన్ని అగౌరవపరిచేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పార్టీలో ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. శనివారం ఏలూరులోని జగన్నాథపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ... Read more

AllAlerts : మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్… ఫోక్సో కేసు నమోదు

మైనర్ బాలిక ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మించి అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిపై కైకలూరు టౌన్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి 24 గంటల్లో అరెస్ట్ చేసినట్టు కైకలూరు టౌన్ ఎస్ఐ డి. వెంకట్ కుమార్ శనివారం ఒక ప్రకటనద్వారా తెలిపారు. ఎస్సై వెంకట్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం… కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను కైకలూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన సుగుణరావు అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా.. సదరు బాలిక భయంతో కేకలు వేసింది. దీంతో నిందితుడు సుగుణరావు అక్కడి నుండి పారిపోయాడు. విషయాన్ని సదరు బాలిక సాయంత్రం ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. ఈ ఘటనపై బాలిక తండ్రి శుక్రవారం రాత్రి కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. సదరు రిపోర్టుపై కైకలూరు టౌన్ ఎస్సై ... Read more

Kaikaluru Tizola : టిజోల ఫుడ్ డెలివరీ యాప్ ప్రారంభించిన కమ్మిలి విఠల్ రావు.

కైకలూరు టిజోల (tizola) యాప్ నిర్వాహుకులు బృందావనంలోని కమ్మిలి విఠల్ రావు నివాసం వద్ద యాప్ మాజీ శాసనసభ్యులు విఠల్ రావు తో ప్రారంభోత్సవం నిర్వహించారు. యాప్ అధినేత బి. సురేష్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో యాప్ ప్రాచుర్యం పొందిందని, కైకలూరు పట్టణ పరిధిలోని ఐదు కిలోమీటర్ల వరకు ఉ 7గం నుండి రాత్రి 10గం వరకు కైకలూరులోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటల్స్, స్వీట్ షాప్స్, నుండి ఫుడ్, టిఫిన్, స్నాక్స్ వంటివి డెలివరీ సౌకర్యం అందిస్తామని తెలిపారు. కైకలూరు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఫుడ్ డోర్ డెలివరీ అందిస్తున్న ఈ యాప్ వాడుకోవాలని కమ్మిలి విఠల్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్రాంచైజీ పంతగాని రాము, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి పూల రాజీ, మంగినేని రామకృష్ణ, కేకే బాబు, అన్నం రాంబాబు, డి రామస్వామి, ఎన్ సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Denduluru : వకరిపై వకరు దాడి చేసుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు.

వకరిపై వకరు దాడి చేసుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పైడిచింతపాడు గ్రామంలో నవంబర్ నెల వృద్దాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘర్షణలో పలువురికి గాయలవ్వగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

AllAlerts : ఏలూరు ఉల్లిపాయబాంబ్ లు పేలిన ఘటనలో ఒకరు సంఘటన స్థలంవద్దే మృతి

ఏలూరు – దీపావళి పండుగ (Diwali) వేళ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. Eluru బాణాసంచా పేలిన ఘటనలో ఒకరు సంఘటన స్థలంవద్దే మృతి చెందారు. బైక్‌పై బాణాసంచాను తీసుకెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు అక్కడి ప్రజలు. కొద్ది సేపటి తరువాత బాణాసంచా పేలిందని తెలియడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుంతోంది. తాజాగా.. ఏలూరులో సుధాకర్ అనే వ్యక్తి బాణాసంచాను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఏలూరు తూర్పువీధి సెంటర్ వద్ద ఒక్కసారిగా ఆయన తీసుకెళ్తున్న బాణాసంచా పేలింది. దాంతో ఒక్కసారిగా పెనువిస్పోటనం సంభవించింది. బాణాసంచాను తీసుకెళ్తున్న సుధాకర్ పేలుడు ధాటికి రెండు ముక్కలయ్యాడు. సగబాగం చిందరవందరగా చుట్టుపక్కల పడ్డాయి. అలాగే అతని ... Read more