Category: ఏలూరుజిల్లా

potti sriramulu : “ఆత్మార్పణ దినోత్సవం” ఘనంగా నిర్వహించిన ఆర్యవైశ్యులు – కైకలూరు

తెలుగు వారి ఆరాధ్యుడు శ్రీ పొట్టి శ్రీరాములు – కామినేని శ్రీనివాస్ గాంధీబొమ్మ సెంటర్ నందు ఆదివారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా “ఆత్మార్పణ దినోత్సవం” ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పోరేషన్ డైరెక్టర్ పి. జె. ఎస్. మాల్యాద్రి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కైకలూరు ప్రధాన రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ లో మాల్యాద్రి బైక్ పై కమ్మిలి విఠల్ రావు ర్యాలీ లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, నియోజకవర్గ ఆర్యవైశ్యులు, ఎన్డీఏ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం గాంధిబొమ్మ సెంటర్లోని పొట్టి శ్రీరాములు, గాంధీజి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్. అనంతరం కృతజ్ఞతా సభలొ పాల్గొని పొట్టి శ్రీరాములు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం ఎవరూ చేయలేనిదని, తెలుగు వారందరికీ ... Read more

Kaikaluru : కామినేని శ్రీనివాస్ ను కలిసిన గ్రీన్ విలేజ్ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.

కైకలూరులోని క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు డా” కామినేని శ్రీనివాస్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఏలూరు రోడ్డులోని గ్రీన్ విల్లెజ్ కాలనీ వాసులు. ఈ సందర్బంగా కాలని వాసులు మాట్లాడుతు కాలని ఎదురుగా పెద్దఎత్తున డంపింగ్ చేసిన చెత్తను తొలగించి తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు తీర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలానే కాలినీని అభివృద్ధి చెయ్యాలని కోరారు. శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి త్వరలోనే మీ సమస్యలు పరిష్కరించి కాలనీ అభివృద్ధి చేస్తామని తెలిపారు.

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి భక్తి పాటలు ఆవిష్కరించిన శ్రీరామ్ తాతయ్య – పాటలు రచించి, పాడిన సయ్యద్ జమీల్ అహ్మద్.

కైకలూరు విద్యాంజలి విద్యాసంస్థల అధినేత సయ్యద్ జమీల్ అహ్మద్ స్వయంగా రచించి పాడిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి రెండు భక్తి పాటలను శ్రీ వాసవి మాత ముద్దుబిడ్డ, ఆర్యవైశ్య అభిమాన నాయకుడు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య వారి చేతుల మీదుగా బుధవారం నాడు ఆవిష్కరించారు. అనంతరం శ్రీరాం తాతయ్య రచయత,సిగర్ జమీల్ ను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ముస్లిం సోదరుడు కుల మతాలకు అతీతంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిపై పాటలు రచించి, పాడడం మా ఆర్యవైశ్యులందరికీ గర్వకారణం అని అభినందించారు. ఈ కార్యక్రమంలో పైడిమర్రి జయ శ్యామల మాల్యాద్రి రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి, ఈదా వెంకటస్వామి కైకలూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి, గడిదేసి విజయ్, కనిశెట్టి శ్యామ్, జగ్గయ్యపేట ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు పాల్గొన్నారు.

Kaikaluru : సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద రాటను ప్రతిష్టించి షష్ఠి ఉత్సవ పనులను ప్రారంభించిన కామినేని శ్రీనివాస్.

ముదినేపల్లి మండలంలోని సింగరాయపాలెం గ్రామం చేవూరుపాలెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నందు రానున్న షష్ఠి మహోత్సవాలు సందర్భంగా కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ బుధవారం ఉదయం ఆలయ ప్రాకారములో రాటను ప్రతిష్టించి షష్టి మహోత్సవ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారి షష్ఠి మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని.. కమిటీ సభ్యులు ఓర్పుతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ సిబ్బంది మరియు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలు ఆధ్యాత్మికతతో వైభవంగా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Kaikaluru – Mubinepalli : అక్రమ మద్యం కలిగి ఉన్నా, బెల్టు షాపులు నిర్వహించినా చర్యలు తప్పవు – ఎస్సై వీరభద్రరావు హెచ్చరిక.

చట్ట విరుద్ధంగా అక్రమ మద్యం కలిగి ఉన్నా, బెల్ట్ షాప్ లు నిర్వహించినా కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ముదినేపల్లి ఎస్సై వీరభద్రరావు మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ… మండలంలోని వైవాక గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమ మద్యం కలిగి ఉండి బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో తన సిబ్బందితో కలిసి దాడిచేసి వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల వద్ద నుండి 120 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

Chintalapoodi : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అదనపు గదులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్50 లక్షల రూపాయల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదనపు గదులకు శంకుస్థాపన అదనపు గదులు నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్ణీత సమయానికి ప్రభుత్వ ఆసుపత్రికి రాని డాక్టర్లను ఉపేక్షించెను. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 లక్షల నిధులతో కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ల్యాబ్ గదులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే వైద్య సేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రజలకు వైద్యం అందిచేందుకు ఏ విధమైన ఇబ్బంది కలిగిన ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ సిబ్బంది ఆశా వర్కర్లు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Kaikaluru: చేతబడులు చేస్తున్నారని అనుమానంతో ముగ్గురిపై దాడి – 18 మంది పై కేసు నమోదు.

కైకలూరు మండలంలోని చటాకాయ గ్రామంలో చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులపై దాడి జరిగిన సంఘటనలో 18 పై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. సమావేశంలో సీఐ రవికుమార్ మాట్లాడుతూ.. చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను గ్రామంలోని కొంతమంది వ్యక్తులు కలిసి విచక్షణారహితంగా వారిపై దాడి చేశారన్నారు. దాడిలో ఇద్దరు వ్యక్తులకు చేతులు విరగగా… మరో వ్యక్తి కనిపించని గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై అదే గ్రామానికి చెందిన సైదు రఘు అనే వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్లో 18 మందిపై కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిందన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కైకలూరు రూరల్ ఎస్సై నిందితులను అరెస్టు చేయగా వారిలో ప్రధాన నిందితులైన ఆరుగురును కైకలూరు జె ఎఫ్ సి ఎం కోర్టు కు రిమాండ్ నిమిత్తం ... Read more

Denduluru : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

రైతులు వద్ద నుండి ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లోకి నగదు జమవుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు. పెదపాడు మండలం కొక్కిరపాడు లోని రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఉదయం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. రైతు బాగుండాలి, వ్యవసాయం లాభసాటిగా వుండాలి అనే నినాదంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందని, గతంలో రైతు కష్టపడి పండించిన పంటను అమ్మేందుకు చాలా ఆంక్షలు వుండేవని, కనీసం గోనే సంచులను సరఫరా చేయలేక గత ప్రభుత్వం చేతులెత్తేసిందని, ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి రైతులను అవస్థలు పాలు చేసిందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. వైసిపి నాయకులు నిర్దేశించిన రైస్ మిల్లులోనే అమ్మాలని, రైతులను ఇబ్బంది పెట్టేవారని అటువంటి పరిస్థితి ఇకనుండి రైతులకు రాకూడదనే మిల్లులు ఎంపిక కూడా రైతులకే అందించామని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంక్ అకౌంట్లో ... Read more