Category: అమరావతి

లడ్డూ విషయంలో రాజకీయాలొద్దు, టీడీపీ, వైసీపీ, జనసేనకు రిక్వెస్ట్ – వైఎస్ షర్మిల

తిరుమల లడ్డూ వ్యవహారంలో హాట్ కామెంట్స్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఒకరేమో శాంతి పూజలు.. మరొకరు ప్రాయశ్చిత్త దీక్ష.. ఇంకొకరేమో ప్రక్షాళన పూజలని అంటున్నారని చెప్పారు.దయ చేసి ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని, మతం రంగు పులమడం అంతకంటే కరెక్ట్ కాదన్నారు. ఇంతకీ షర్మిల వ్యాఖ్యల వెనుక అసలేం జరుగుతోంది? ఇదే చర్చ ఏపీ అంతటా మొదలైంది. తిరుమల లడ్డూ అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని అందరి కంటే ముందు ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేసిందన్నారు వైఎస్ షర్మిల. లడ్డూ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేయాలని సీజేఐకి, అటు కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ లేఖ రాసిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. సిట్ కంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరగాలన్న రీతిలో ఉన్నట్లు అర్థమవుతోంది షర్మిల. లడ్డూ విషయాన్ని రాజకీయం చేయొద్దని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మాజీ సీఎం జగన్ ... Read more

Vangalapudi Anitha – 6,100 కానిస్టేబుల్స్ నియామక ప్రక్రియ.

రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయిదని, కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (PMT,PET) పరీక్షలను ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. 2022లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరుకాగా… 95,209 మంది తదుపరి దశకు ఎంపికయ్యారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు కారణాల వల్ల వాయిదా పడడంతో కానిస్టేబుల్‌ (సివిల్‌)- 3,580, కానిస్టేబుల్‌ (ఏపీఎస్‌పీ) -2,520 పోస్టుల ప్రక్రియ వాయిదా పడిరదన్నారు. ప్రిలిమినరీ పరీక్షకు 3,622 మంది హోంగార్డులు హాజరుకాగా 382 మంది అర్హత సాధించారన్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు హైకోర్టులో 14 రిట్‌ పిటిషన్లు వేశార న్నారు. ప్రత్యేక కేటగిరీ కోటాలో ప్రత్యేక మెరిట్‌ జాబితా ను ప్రకటించాలని వారు కోర్టును ... Read more

 AP BJP వారధి, Purandeswari – తిరుమల లడ్డూపై సమీక్ష చేసిన తర్వాతే సీఎం చంద్రబాబు మాట్లాడారు

సమీక్ష చేసిన తర్వాతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన విషయాన్ని ప్రజలకు సీఎం చంద్రబాబు తెలియజెప్పి ఉంటారని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందని పురంధేశ్వరి పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వచ్చిన సమాచారంతో ఆయన ప్రకటన చేశారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అధికారులతో సమీక్ష చేసుకున్న తర్వాతే తిరుమల లడ్డూ విషయంపై మాట్లాడి ఉంటారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనతరం ఆయా సమస్యలపై అధికారుతో మాట్లాడారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. సీఎంగా ఆయన అపచారం జరిగిన విషయాన్ని ప్రజలకు తెలియ చెప్పి ఉంటారని చెప్పారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని ‘మీరు ఎందుకు ... Read more

Holidays – పాఠశాలలకు దసరా సెలవులు

ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభంకానున్నాయి. ఈనెల 3న గురువారం నుంచి 13వ ఆదివారం తేదీ వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించిది. మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 12వ తేదీన దసరా పండుగ రానుంది. ఈ క్రమంలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 3 గురువారం నుంచి – 13 ఆదివారం తేదీ వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దాసర సెలవల అంతరం ఈనెల 14 సోమవారం తేదీన స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉదయం ... Read more

anam -కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తాము – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతులు పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. నెల్లూరు : కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సిజిఎఫ్ కింద 160 ఆలయాలు పున: నిర్మిస్తామని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు ఆలయ భూములు పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. 50వేల రూపాయలు కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థిక సాయం పెంచుతున్నట్లు ప్రకటించారు. తిరుమల నుంచే దేవాదాయ శాఖలో ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాలో ... Read more

tungabhadra – డ్యామ్‌ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తాం – పయ్యావుల కేశవ్ తుంగభద్ర డ్యామ్‌ ఘటనతో ఏపీ ప్రభుత్వం అలర్ట్డ్యామ్‌ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరాతుంగభద్ర డ్యామ్‌ అధికారులు, నిపుణులతో మాట్లాడాంవీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తాం – పయ్యావుల కేశవ్రాయలసీమ రైతులకు తుంగభద్ర డ్యామ్‌ జీవనాధారంసమస్యపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిందినీరు వృధాకాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాంప్రభుత్వం తరపున డ్యామ్ అధికారులకు సహకారం అందిస్తాం-మంత్రి పయ్యావుల కేశవ్

kolleru- కొల్లేరు సరస్సును సందర్శించండి – కామినేని శ్రీనివాస్

కొల్లేరు సరస్సును సందర్శించండి. గవర్నర్ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే కామినేని కొల్లేరు సరస్సులోని పక్షుల కేంద్రాన్ని సందర్శించాలని రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీరు ఆహ్వానించినట్లు కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలో గురువారం గవర్నర్ను కలసి ఆహ్వానించారు. ఈ నెల 17న నెల్లూరు స్వర్ణభారతీ ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో కూడా పాల్గొనాలని ఆహ్వానించారు. స్వర్ణభారతీ ట్రస్ట్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనకర్ కూడా హాజరవుతారని తెలిపారు.