Author: ijam reporter

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డ్ దారులందరికీ నవంబరు నుంచి ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని MLSపాయింట్లకు సరిపడా సరుకులు రవాణా చేసేలా పౌరసరఫరాలశాఖ చర్యలు తీసుకుంది. నవంబరు1 నుండి రేషన్ కార్డు దారులందరికీ రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. కిలో కందిపప్పు రూ.67కు, అరకిలో పంచదార రూ.17కు అందించేందుకు చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.

Read More

ఏలూరు – దీపావళి పండుగ (Diwali) వేళ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. Eluru బాణాసంచా పేలిన ఘటనలో ఒకరు సంఘటన స్థలంవద్దే మృతి చెందారు. బైక్‌పై బాణాసంచాను తీసుకెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు అక్కడి ప్రజలు. కొద్ది సేపటి తరువాత బాణాసంచా పేలిందని తెలియడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుంతోంది. తాజాగా.. ఏలూరులో సుధాకర్ అనే వ్యక్తి బాణాసంచాను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఏలూరు తూర్పువీధి సెంటర్ వద్ద ఒక్కసారిగా ఆయన తీసుకెళ్తున్న బాణాసంచా పేలింది. దాంతో ఒక్కసారిగా పెనువిస్పోటనం సంభవించింది. బాణాసంచాను తీసుకెళ్తున్న సుధాకర్ పేలుడు ధాటికి రెండు ముక్కలయ్యాడు. సగబాగం చిందరవందరగా చుట్టుపక్కల పడ్డాయి. అలాగే అతని…

Read More

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రాగునీరు, రహదారుల అభివృద్ధి పనులకు 4.65 కోట్లతో ప్రతిపాదనలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో త్రాగు నీరు, రహదారి సమస్యలకు చెక్ పెట్టేందుకు 4.65 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. ఈ మేరకు ఈనెల 29వ తేదీన ఉదయం జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించనుంది. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ముందుగా గౌరవ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కు మున్సిపల్ కమిషనర్ కొమ్మనేని వెంకటరమణ వివరించారు. నియోజవర్గంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఆదాయం పెంచడం , వాటి పనితీరు మెరుగుపరచడం ద్వారా మరింత అభివృద్ధికి తోడ్పడుతామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి పట్టణ సుందరీకరణకు కోసం నిధులు మంజూరుకు కృషి చేస్తామని రోషన్ కుమార్ ఈ సందర్భంగా కమిషనర్ కు…

Read More

నూజివీడు : క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని మాజీ మంత్రి, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం నూజివీడు లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు.బిజెపి జిల్లా అధ్యక్షులు సి. హెచ్. విక్రమ్ కిషోర్ సమావేశానికి అధ్యక్షుత వహించగా పట్టణ అధ్యక్షుడు బోను అప్పారావు అతిధులకు ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నేత్రుత్వంలోని ఎన్. డి. ఏ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.గ్రామీణ స్థాయిలో బిజెపి మరింత బలపడటానికి కార్యకర్తలు కార్యోణ్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. అన్నీ వర్గాల నుంచి వస్తున్న మద్దతుతో…

Read More

ఏలూరుజిల్లా మండవల్లి మండలం మండవల్లి లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు డా” కామినేని శ్రీనివాస్. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పధకాలను సద్వినియోగం చేసుకోవాలని, కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువు, క్రమశిక్షణతో మెలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

గంజాయి రహిత గ్రామాలకై అందరూ కృషి చేయాలి – అంబుల. వైష్ణవి ముదినేపల్లి : గంజాయి రహిత గ్రామాలకై సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల. వైష్ణవి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని డాక్టర్లు, మందుల దుకాణాల యజమానులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బందితో కలిసి అంబుల వైష్ణవి, డా. మనోజ్ ల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగంపై రహదారుల వెంట ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో అంబుల వైష్ణవి, మనోజ్ లు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గంజాయికి దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు వంటి వాటిని దగ్గరకు రానీయకూడదన్నారు. అలాగే గ్రామంలో ఎవరైనా డ్రగ్స్ కు అలవాటు పడినవారు ఉంటే మానుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Read More

కైకలూరు నియోజకవర్గం లో 53వ రోజు అన్నా క్యాంటిన్ నిర్వహణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలు మేరకు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 53 రోజుకు చేరింది. శనివారం అన్నదాతగా ఆవకూరు గ్రామస్తులు మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమల శెట్టి రామాంజనేయులు సతీమణి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు 400 మందికి అన్నదానం అందించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబీ), తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పులా రాజి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలు మేరకు దాతల సహాయం…

Read More

కైకలూరు పట్టణ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పి కృష్ణా ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించిన తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పూల రామచంద్రరావు(రాజి), జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబి), జనసేన నాయకులు తులసి పూర్ణ, ఘంటశాల చందు, తదితరులు.

Read More