ఏలూరుజిల్లా మండవల్లి మండలం మండవల్లి లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు డా” కామినేని శ్రీనివాస్. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పధకాలను సద్వినియోగం చేసుకోవాలని, కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువు, క్రమశిక్షణతో మెలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Author: ijam roporter
గంజాయి రహిత గ్రామాలకై అందరూ కృషి చేయాలి – అంబుల. వైష్ణవి ముదినేపల్లి : గంజాయి రహిత గ్రామాలకై సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల. వైష్ణవి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని డాక్టర్లు, మందుల దుకాణాల యజమానులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బందితో కలిసి అంబుల వైష్ణవి, డా. మనోజ్ ల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగంపై రహదారుల వెంట ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో అంబుల వైష్ణవి, మనోజ్ లు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గంజాయికి దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు వంటి వాటిని దగ్గరకు రానీయకూడదన్నారు. అలాగే గ్రామంలో ఎవరైనా డ్రగ్స్ కు అలవాటు పడినవారు ఉంటే మానుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
కైకలూరు నియోజకవర్గం లో 53వ రోజు అన్నా క్యాంటిన్ నిర్వహణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలు మేరకు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 53 రోజుకు చేరింది. శనివారం అన్నదాతగా ఆవకూరు గ్రామస్తులు మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమల శెట్టి రామాంజనేయులు సతీమణి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు 400 మందికి అన్నదానం అందించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబీ), తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పులా రాజి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలు మేరకు దాతల సహాయం…
కైకలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పి కృష్ణా ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించిన తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పూల రామచంద్రరావు(రాజి), జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబి), జనసేన నాయకులు తులసి పూర్ణ, ఘంటశాల చందు, తదితరులు.
కైకలూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చిత్రపటం (కటౌట్) కు పాలాభిషేకం చేసిన అర్చకులు. ప్రైవేటు దేవస్థానములో ధూపదీప నైవేద్యాలు సమర్పించేందుకు ప్రతినెలా పదివేల రూపాయలు ప్రభుత్వం నుండి అర్చకులకు అందేలా జీవో విడుదల చేయడంతో చంద్రబాబు కటౌట్ కు పాలాభిషేకం చేసిన అర్చకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దైవం అండగా ఉండాలని అర్చకులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యమ్ ఎ రహీమ్, కె కె బాబు, వీరాబత్తిన సుధ, పి రాధాకృష్ణ, లక్కింశెట్టి మోహన్, సదర్ల సూరి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 గేట్ల ద్వారా శుక్రవారం నీటిని విడుదల చేసిన అధికారులు. 22 క్రస్ట్‌గేట్లను 5 అడుగులు, 4గేట్లను 10అడుగుల మేర ఎత్తి 2,30,504 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జునసాగర్ జలాశ యం నీటిమట్టం 587.50 అడుగులు ఉంది. ఇది 305.80 టీఎంసీలకు సమానం. కుడి కాలువ ద్వారా 8680 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8367, 26 క్రస్ట్‌గేట్ల ద్వారా 2,30,504, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29,029, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 2,78,380 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 3,11,491 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కాగా 26 క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు విడుదల చేస్తుండడంతో తిలకించేందుకు పర్యాటకులు శుక్రవారం పోటెత్తారు. రహదారులు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సందడిగా గడిపారు. 42 టీఎంసీలకు చేరిన నదీ జలాలు వరదతో…
ప్రజా సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి చంద్ర బాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్ అన్నారు. తోటగూడెంలో గురువారం జరిగిన మీ కోసం – మీ చింతమనేని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామసభ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని, వారి నుంచి వినతులు స్వీకరించారు. తాగు, సాగు నీరు, గ్రామాల్లో పారిశుధ్యం, డ్రెయిన్ల మరమ్మతు, అంతర్గత రహ దారులు అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందజేస్తామన్నారు. గ్రామసభ ద్వారా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కా రానికి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఉప్పలపాటి రామ్‌ప్రసాద్, గుత్తా అనిల్, లావేటి శ్రీనివాసరావు, పెద్ది రమేష్, కంభంపాటి సునీల్‌కుమార్, దండమూడి సీతారాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. గత నెల జూలైలో ప్రారంభమైన వరద ప్రవాహంతో క్రమంగా జలాశయం నిండుకుంది. జూలై 29 తేదీన జలాశయం మూడు క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ పరివాహక ప్రాంతాలు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుండడంతో శుక్రవారం డ్యామ్ అధికారులు జలాశయం 10 క్రస్టుగేట్లును 14 అడుగులు ఎత్తి నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 2,89,265 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 40,311 క్యూసెక్కులు మొత్తం 3,29,576 వరద ప్రవాహం వస్తోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 3,92,415 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు…