తిరుపతి మండలం తిరుచానూరుఅర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుపతి శిల్పారామంలో జ రిగింది. ప్లే జోన్లో ఉన్న శిల్పారామంలో క్రాస్ వీల్ బకెట్ ఊడిపడటంతో అందులో కూర్చున్న యువతులు కిందప డిపోయారు. ఈ ఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా మ రొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదివారం సెలవు దినం కావడంతో ఆటవిడుపు కోసం వెళ్లిన ఇద్దరు యువతులు అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యారు. తిరుపతి జిల్లా, తిరుచానూరు రోడ్డు లోని శిల్పారామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఎక్కిన క్రాస్ వీల్ తుప్పు పట్టి ఊడి కిందపడటంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతికి చెందిన లోకేశ్వరి(25), గౌతమి లు ఆదివారం సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు శిల్పారామం వచ్చారు. ఇద్దరు కలిసి అక్కడ ఉన్న క్రాస్ వీల్ ఎక్కారు. అది వేగంగా తిరుగుతుండగా యువతులు కూర్చొన్న సీటు దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి ఊడి కింద పడింది. దీంతో లోకేశ్వరి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. గౌతమికి తీవ్రంగా గాయపడటంతో నగరంలోని ప్రైవేటు ఆసు పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

క్రాస్ వీలు ఉన్న కుర్చీలో ఒకరే కూర్చోవాల్సి ఉండగా ఇద్దరిని కూర్చోబెట్టారు. అప్పటికే అది తుప్పుపట్టి బలహీనంగా ఉండటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఉన్న కుర్చీలన్ని విరిగిపోడానికి సిద్ధంగా ఉన్నాయని గుర్తించారు. పార్క్ నిర్వాహకుడు ప్రభాకర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Share.
Exit mobile version