ఫ్లెక్సీలు, సోషల్ మీడియా పోస్టులతో లా అండ్ ఆర్డర్ సమస్యలకు కారకులయ్యే వారిని సహించేది లేదు :అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్

శనివారం అవనిగడ్డ పోలీస్ స్టేషనులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ..

ఫ్లెక్సీల ఏర్పాటుకు పంచాయతీ, విద్యుత్ శాఖల అనుమతి తీసుకోవాలన్నారు.

ఇతరుల, సమూహాల, వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా ఫ్లెక్సీలు వేయిస్తే వాటిని తయారు చేయించే వారితో పాటు, ముద్రించే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

ఏదైనా వేడుకలకు అనుమతి తీసుకొని ఏర్పాటు చేసుకునే ఫ్లెక్సీలు సందర్భం పూర్తి కాగానే తొలగించాలని స్పష్టం చేశారు.

సమస్యలు సృష్టించే ప్రదేశాల్లో ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వవద్దని ఇప్పటికే సంబంధిత శాఖలకు లేఖలు రాసినట్లు తెలిపారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పదేపదే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై చట్టపరంగా రౌడీషీట్లు కూడా ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ యువ కుమార్, చల్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు, అవనిగడ్డ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Share.
Exit mobile version