ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభంకానున్నాయి. ఈనెల 3న గురువారం నుంచి 13వ ఆదివారం తేదీ వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించిది. మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 12వ తేదీన దసరా పండుగ రానుంది. ఈ క్రమంలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 3 గురువారం నుంచి – 13 ఆదివారం తేదీ వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

దాసర సెలవల అంతరం ఈనెల 14 సోమవారం తేదీన స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు ఈ నిర్ణయం వర్తించనుంది. మరోవైపు అక్టోబర్ 3 నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్ 12న విజయదశమి పండుగతో ఉత్సవాలు ముగియనున్నాయి.

Share.
Exit mobile version