ఏలూరుజిల్లా మండవల్లి మండలం మండవల్లి లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు డా” కామినేని శ్రీనివాస్. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పధకాలను సద్వినియోగం చేసుకోవాలని, కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువు, క్రమశిక్షణతో మెలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరుజిల్లా
18 Views
ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు డా” కామినేని శ్రీనివాస్
Previous Articleనాలుగు బైక్స్ రికవరీ ఇద్దరు అరెస్ట్ – ముదినేపల్లి
Next Article ఎన్డీఏ కూటమి నూతన కార్యాలయం ప్రారంభం – ముదినేపల్లి