దీంతో పోతిరెడ్డిపాడుకు 18వేల క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్‌లో అన్ని ప్రాజెక్టులకు ఒక్కసారిగా జలకళను సంతరించుకున్నాయి. సాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల నిన్న మొన్నటి వరకు తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులను ఎదుర్కొన్నాయి. సాగర్ నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్దం కొనసాగింది. ప్రకాశం బ్యారేజీ దిగువున కృష్ణా జలాలను నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో వరద ప్రవాహాన్ని నిల్వ చేసుకునే అవకాశాలు లేకుండా పోయాయి. ప్రకాశం బ్యారేజీ ఎగువన ఓ రిజర్వాయర్, దిగువన మరో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.


Telugu HindustanTtimes
Share.
Exit mobile version