Author: ijam.77799@gmail.com

నర్సమ్మ దోసెలు రుచిచూడాల్సిందే శ్రీ సత్యసాయి జిల్లా : కదిరికి సమీపంలోని కూటగుళ్ల గ్రామంలో నర్సమ్మ హోటల్ ఉంది. రోజుకు రూ.10 వేలు చొప్పున నెలకు దాదాపు రూ. 3 లక్షల వ్యాపారం జరుగుతుందని నర్సమ్మ తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారం సాఫీగా సాగుతుందని అంటున్నారు. నర్సమ్మ హోటల్ లో వివిధ రకాల దోసెలు విక్రయిస్తారు. ఎగ్ ఎగ్ దోసె రూ. 25 , సాధారణ దోసెలు రూ. 10 , కారం దోసెలు రూ.25 అందిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం వరకు అమ్మకాలు జరుగుతాయని నర్సమ్మ తెలిపారు. రోడ్డు పక్కనే కావడంతో వాహనదారులు, ప్రయాణికులు ఈ హోటల్ కు వస్తుంటారు. నర్సమ్మ హోటల్ దోసెల రుచి తెలిసిన స్థానిక కూలీలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు అక్కడకు నిత్యం వస్తుంటారు. తక్కువ ఖర్చు, రుచికి అమోఘంతో నర్సమ్మ దోసెల కోసం క్యూ కడుతుంటారు. ఈ హోటల్ లో…

Read More

మంగళవారం రాత్రికి జూరాల నుంచి 2,81,196 క్యూసెక్కులు, తుంగభద్ర ద్వారా 1,07,246 క్యూసెక్కులతో కలిపి 3,88,442 క్యూసెక్కుల నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతున్నాయి. జలాశయ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215 టీఎంసీలుగా నమోదైంది. Telugu HindustanTimes

Read More

Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వాలంటీర్లపై నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ప్రభుత్వంలో పవన్‌ కల్యాణ్ పై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని అప్పట్లో పవన్ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. Telugu HindustanTimes

Read More

నాసిరకం మద్యంఏపీలో గత ఐదేళ్లుగా మద్యం వ్యాపారాన్ని నేరుగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. వైసీపీ హయాంలో మద్యం విక్రయాల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. మద్యం పాలసీలో అక్రమాల మాటటుంచితే గత ఐదేళ్లలో ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లను మాత్రమే జనం కొనాల్సి వచ్చేది. ఊరుపేరు లేని బ్రాండ్లతో పాటు దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో మాత్రమే విక్రయించేవారు. నాసిరకం మద్యం, డిస్టిలరీల్లో తయారై నేరుగా దుకాణాలకు చేరిపోయే మద్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా వైసీపీ ప్రభుత్వం వాటిని ఖాతరు చేయలేదు. సంపూర్ణ మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఐదేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేసింది. మద్యం ధరల్ని గణనీయంగా పెంచేసి విక్రయాలు జరిపారు. 2019మే నాటి ఉన్న ధరలతో పోలిస్తే 2024నాటికి అవి దాదాపు రెట్టింపు అయ్యాయి. Telugu HindustanTimes

Read More

Pulasa Fish : కోన‌సీమ జిల్లాల్లో ఖ‌రీదైన పుల‌స చేప‌తో ఏకంగా విందే పెట్టారు. ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పుస్తల‌మ్మి అయినా స‌రే పుల‌స చేప తినాల‌నే నానుడి ఉంది. ఆ పుల‌స చేప అంత ఖ‌రీదైన‌ది. అలాగే రుచి కూడా ఖ‌రీదుకు త‌గ్గట్టుగానే ఉంటుంది. Telugu HindustanTimes

Read More

Sharmila on Arogyrasri: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్డీఏ నేతల్ని ప్రశ్నించారు.  Telugu HindustanTtimes

Read More

SI Generousity: రోడ్డు పక్కన వర్షంలో తడుస్తూ చెప్పులు కుట్టే పనిలో ఉన్న వృద్ధుడికి స్థానిక ఎస్సై  చిన్న బడ్డీని ఏర్పాటు చేయడం స్థానికుల హృదయాలను హత్తుకుంది.  Telugu HindustanTtimes

Read More

దీంతో పోతిరెడ్డిపాడుకు 18వేల క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్‌లో అన్ని ప్రాజెక్టులకు ఒక్కసారిగా జలకళను సంతరించుకున్నాయి. సాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల నిన్న మొన్నటి వరకు తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులను ఎదుర్కొన్నాయి. సాగర్ నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్దం కొనసాగింది. ప్రకాశం బ్యారేజీ దిగువున కృష్ణా జలాలను నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో వరద ప్రవాహాన్ని నిల్వ చేసుకునే అవకాశాలు లేకుండా పోయాయి. ప్రకాశం బ్యారేజీ ఎగువన ఓ రిజర్వాయర్, దిగువన మరో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. Telugu HindustanTtimes

Read More