వివాదాలను పరిష్కరించడానికి, వక్ఫ్ బోర్డులు క్లెయిమ్ చేసిన ఆస్తులపై క్లారిటీ వచ్చేందుకు ఈ సవరణ ఉపయోగపడుతుందని కొందరు అంటున్నారు. వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణలో మేజిస్ట్రేట్‌లు పాల్గొనవచ్చు. ప్రస్తుత చట్టాలను మార్చాలనే డిమాండ్ ముస్లిం మేధావులు, మహిళలు, షియాలు, బోహ్రాస్ వంటి వివిధ వర్గాల నుండి వచ్చిందని కొందరు చెప్పే మాట. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుల కింద సుమారు 8 లక్షల 70 వేల ఆస్తులు ఉండగా, ఈ ఆస్తుల కింద మొత్తం భూమి దాదాపు 9 లక్షల 40 వేల ఎకరాలు ఉంది.