Sunday, September 15, 2024
HomeAndhra Pradeshvenkayya naidu: రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి..

venkayya naidu: రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి..

బాపట్ల – ఏపీ రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రతో మ్యూజియం ఏర్పాటు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. మహనీయుల జీవిత చరిత్రలు నేటి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జాగర్లమూడిలో మాజీ ఎమ్మెల్యే కుప్పుస్వామి చౌదరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయనకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చీరాల రైల్వేస్టేషన్‌‌లో ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వెంకయ్య నాయుడు కుప్పుస్వామి చౌదరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments