Tag: godavari

Description of the image

Bhimavaram : అయోధ్య శ్రీరామునికి 13 కేజీల వెండి, ఒక కేజీ బంగారంతో తయారుచేసిన ధనస్సు – శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు అందుకున్న అయోధ్య రాముని మహా ధనస్సు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మాట్లాడుతూ అయోధ్య నగరానికి వెళుతున్న ఈ రామ ధనస్సు ఎంతో విశిష్టమైనదని, ఏడు మోక్షమార్గాలలో అయోధ్య మొదటిదని, ఒక కేజీ బంగారం, 13 కేజీలు వెండితో తయారు చేసిన ధనస్సు చల్లా శ్రీనివాస ఆధ్వర్యంలో శ్రీరాముడు పుట్టిన అయోధ్యకు ఈ ధనుస్సుని తీసుకువెళుతున్నారని, ఈ ధనస్సు ఈ ప్రాంతానికి రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని తెలిపారు. శ్రీ మావుళ్ళమ్మ ఆలయం వద్ద జైశ్రీరామ్ నినాదాలతో భక్తి పారవశ్యంతో పర్వసిశించారు భక్తులు.

Undi : పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభించిన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు.

ఉండి నియోజకవర్గం ప్రధాన కేంద్రమైన ఉండి పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభించిన. స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ పి నాగరాణి. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఎస్పీ మాట్లాడుతూ నూతన భవనాన్ని ప్రజా ప్రతినిధులతో ప్రారంభించడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ త్వరలోనే నియోజకవర్గం లో పోలీస్ స్టేషన్లను మారుస్తున్నట్లు అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ కు కొత్త వెహికల్ ఏర్పాటు చేస్తున్నట్లు క్రైమ్ రేట్ తగ్గించే దిశగా నియోజవర్గం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.