Tag: elr

Description of the image

Kaikaluru : సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద రాటను ప్రతిష్టించి షష్ఠి ఉత్సవ పనులను ప్రారంభించిన కామినేని శ్రీనివాస్.

ముదినేపల్లి మండలంలోని సింగరాయపాలెం గ్రామం చేవూరుపాలెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నందు రానున్న షష్ఠి మహోత్సవాలు సందర్భంగా కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ బుధవారం ఉదయం ఆలయ ప్రాకారములో రాటను ప్రతిష్టించి షష్టి మహోత్సవ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారి షష్ఠి మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని.. కమిటీ సభ్యులు ఓర్పుతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ సిబ్బంది మరియు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలు ఆధ్యాత్మికతతో వైభవంగా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు : ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘దీపం-2’ కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ను ప్రారంభిస్తున్న – సనాతన ధర్మం కోసం పార్టీలో ప్రత్యేక వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు చెప్పిన : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక – మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – సనాతన ధర్మాన్ని కాపాడేందుకు జనసేనలో ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, కానీ తన విశ్వాసాలపై నిలబడతానని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, సనాతన ధర్మాన్ని అగౌరవపరిచేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పార్టీలో ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. శనివారం ఏలూరులోని జగన్నాథపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ... Read more

AllAlerts : మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్… ఫోక్సో కేసు నమోదు

మైనర్ బాలిక ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మించి అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిపై కైకలూరు టౌన్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి 24 గంటల్లో అరెస్ట్ చేసినట్టు కైకలూరు టౌన్ ఎస్ఐ డి. వెంకట్ కుమార్ శనివారం ఒక ప్రకటనద్వారా తెలిపారు. ఎస్సై వెంకట్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం… కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను కైకలూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన సుగుణరావు అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా.. సదరు బాలిక భయంతో కేకలు వేసింది. దీంతో నిందితుడు సుగుణరావు అక్కడి నుండి పారిపోయాడు. విషయాన్ని సదరు బాలిక సాయంత్రం ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. ఈ ఘటనపై బాలిక తండ్రి శుక్రవారం రాత్రి కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. సదరు రిపోర్టుపై కైకలూరు టౌన్ ఎస్సై ... Read more

AllAlerts : ఏలూరు ఉల్లిపాయబాంబ్ లు పేలిన ఘటనలో ఒకరు సంఘటన స్థలంవద్దే మృతి

ఏలూరు – దీపావళి పండుగ (Diwali) వేళ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. Eluru బాణాసంచా పేలిన ఘటనలో ఒకరు సంఘటన స్థలంవద్దే మృతి చెందారు. బైక్‌పై బాణాసంచాను తీసుకెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు అక్కడి ప్రజలు. కొద్ది సేపటి తరువాత బాణాసంచా పేలిందని తెలియడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుంతోంది. తాజాగా.. ఏలూరులో సుధాకర్ అనే వ్యక్తి బాణాసంచాను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఏలూరు తూర్పువీధి సెంటర్ వద్ద ఒక్కసారిగా ఆయన తీసుకెళ్తున్న బాణాసంచా పేలింది. దాంతో ఒక్కసారిగా పెనువిస్పోటనం సంభవించింది. బాణాసంచాను తీసుకెళ్తున్న సుధాకర్ పేలుడు ధాటికి రెండు ముక్కలయ్యాడు. సగబాగం చిందరవందరగా చుట్టుపక్కల పడ్డాయి. అలాగే అతని ... Read more

Nuziveedu : సంస్థాగతంగా బిజెపి బలోపేతం – మాజీ మంత్రి కామినేని

నూజివీడు : క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని మాజీ మంత్రి, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం నూజివీడు లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు.బిజెపి జిల్లా అధ్యక్షులు సి. హెచ్. విక్రమ్ కిషోర్ సమావేశానికి అధ్యక్షుత వహించగా పట్టణ అధ్యక్షుడు బోను అప్పారావు అతిధులకు ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నేత్రుత్వంలోని ఎన్. డి. ఏ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.గ్రామీణ స్థాయిలో బిజెపి మరింత బలపడటానికి కార్యకర్తలు కార్యోణ్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. అన్నీ వర్గాల నుంచి వస్తున్న మద్దతుతో ... Read more