Tag: deepam
ఏలూరు : ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘దీపం-2’ కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్
సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ను ప్రారంభిస్తున్న – సనాతన ధర్మం కోసం పార్టీలో ప్రత్యేక వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు చెప్పిన : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక – మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – సనాతన ధర్మాన్ని కాపాడేందుకు జనసేనలో ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, కానీ తన విశ్వాసాలపై నిలబడతానని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, సనాతన ధర్మాన్ని అగౌరవపరిచేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పార్టీలో ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. శనివారం ఏలూరులోని జగన్నాథపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ... Read more
గుడివాడ : దీపం-2 పథక లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందచేసిన నాయకులు
దీపం-2 పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని కూటమి పార్టీల నాయకులు పేర్కొన్నారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని విజయ గ్యాస్ ఏజెన్సీలో కూటమి పార్టీల నేతలతో కలిసి…మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, కృష్ణా జిల్లా బిజెపి అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజబాబు దీపం-2 పథక లబ్ధిదారులకు.. ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా.. సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. అబద్దాలపై పాలన చేసిన వైకాపా… ఇప్పటికీ బుద్ధి మార్చుకోక ఆకాశంపైకి ఉమ్మి వేసినట్లు సామాజిక మాధ్యమాల్లో… కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసే కూటమి ప్రభుత్వంపై వైకాపా సైకోలు చేసే ప్రచారాన్ని ప్రజలెవరు విశ్వసించరని బుద్ధి ... Read more