Tag: crime

Description of the image

Crime Prakasam : విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.

నెల రోజులుగా విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ట్యూషన్ మాస్టర్ పై విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు.ప్రకాశం జిల్లాలో విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వేటపాలెం మండలంలో చోటు చేసుకుంది. ట్యూషన్కు వెళ్లిన విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం. వెంకటేశ్వర్లు ఆదివారం మీడియాకి తెలిపారు.

AllAlerts : మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్… ఫోక్సో కేసు నమోదు

మైనర్ బాలిక ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మించి అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిపై కైకలూరు టౌన్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి 24 గంటల్లో అరెస్ట్ చేసినట్టు కైకలూరు టౌన్ ఎస్ఐ డి. వెంకట్ కుమార్ శనివారం ఒక ప్రకటనద్వారా తెలిపారు. ఎస్సై వెంకట్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం… కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను కైకలూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన సుగుణరావు అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా.. సదరు బాలిక భయంతో కేకలు వేసింది. దీంతో నిందితుడు సుగుణరావు అక్కడి నుండి పారిపోయాడు. విషయాన్ని సదరు బాలిక సాయంత్రం ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. ఈ ఘటనపై బాలిక తండ్రి శుక్రవారం రాత్రి కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. సదరు రిపోర్టుపై కైకలూరు టౌన్ ఎస్సై ... Read more