Tag: జతయ

Thailand Bus Fire Accident : ట్రిప్‌కి వెళ్లి వస్తుండగా స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది విద్యార్థులు మృతి-thailand bus fire accident at least 25 students dead as school bus with 44 catches fire ,జాతీయ

బ్యాంకాక్‌లోని సబర్బన్‌లో బస్సు టైరు పగిలిపోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది. 44 మందితో బస్సు ఉథాయ్ థాని ప్రావిన్స్‌ నుంచి తిరిగి వస్తుంది. పాఠశాల విద్యార్థులు, వారి టీచర్లు ట్రిప్‌కు వెళ్లివస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు ముందు టైరు పగిలిపోవడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(CNG)తో నడిచేది. క్రాష్ కారణంగా ట్యాంకుల్లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే బస్సులోకి మంటలు వ్యాపించాయి. Telugu Hindustan Times

Bulldozer action : ‘ప్రజా భద్రతే ముఖ్యం- ఆ మతపరమైన నిర్మాణాలను..’- సుప్రీంకోర్టు-whether it is temple or dargah supreme court on bulldozer action ,జాతీయ

రహదారులు, జలవనరులు, రైల్వే లైన్లను ఆక్రమించే మతపరమైన నిర్మాణాల కంటే ప్రజా భద్రతకే ప్రాధాన్యమిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బుల్డోజర్​, ఆక్రమణ వ్యతిరేక కార్యకలాపాలపై తాము ఇచ్చిన ఆదేశాలు, మతాలకు సంబంధం లేకుండా అందరికి సమానంగా వర్తిస్తుందని పేర్కొంది. నేరస్థులపై బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్​లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. Telugu Hindustan Times