ట్రైనీ డాక్టర్ గుర్తింపును సోషల్ మీడియాలో బహిర్గతం చేయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది కిన్నోరి ఘోష్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. బాధితురాలి పేరు, సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ సహా ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా వ్యాపించాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.