ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్గీకరణను సమర్థిస్తూ.. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని స్పష్టత ఇచ్చింది. గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీల్లోని వెనకబడిన కులాలకు లబ్ధి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.