డైనమిక్ ఆఫీసర్
డీఎస్పీ అయిన తరువాత మానవ అక్రమ రవాణా, మతమార్పిడి, హత్యలు, బాలికలపై నేరాలకు సంబంధించిన అనే కేసులపై లోతుగా ఇన్వెస్టిగేషన్ చేశారు. నిందితులకు శిక్షపడే విధంగా సాక్ష్యాలు సంపాదించారు. సిమ్లాలోని కోథాయ్‌లోని గుడియాపై అత్యాచారం హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజా వార్తల్లోకి ఎక్కారు. ఈ కేసు దర్యాప్తును అత్యుత్తమ దర్యాప్తుగా పరిగణిస్తారు. ఓ లవ్ జిహాద్ కేసును కూడా ఆమె పట్టుకున్నారు. అంతేకాదు దేశం మెుత్తం ఉలిక్కిపడేలా చేసిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసును కూడా సీమా డీల్ చేశారు. ఇలా ఆమె చాలా చోట్ల పని చేసి డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు.