Blog
Devotional : కార్తీకమాసం విశేష రోజులు
నవంబరు 02 స్థిరవారం నుండి కార్తీక మాసం మొదలవుతోంది. నవంబరు 03 ఆదివారం యమవిదియ – భగినీహస్త భోజనం నవంబర్ 04 మొదటి కార్తీక సోమవారం నవంబరు 05, మంగళవారంనాగుల చవితి నవంబర్ 11 రెండవ కార్తీక సోమవారం నవంబరు 12 మంగళవారం ఏకాదశి నవంబరు 13 బుధవారంక్షీరాబ్ది ద్వాదశి దీపాలు నవంబరు 15 శుక్రవారం – కార్తీకపూర్ణిమ నవంబర్ 18 కార్తీకమాసం మూడో సోమవారం నవంబర్ 25 కార్తీకమాసం నాలుగో సోమవారం నవంబర్ 26 కార్తీక బహుళ ఏకాదశి నవంబర్ 29 కార్తీక మాసం మాస శివరాత్రి డిసెంబర్ 1, ఆదివారం కార్తీక అమావాస్య డిసెంబర్ 2 సోమవారం మార్గశిర శుధ్ధ పాడ్యమిపోలి స్వర్గం ఈ ఏడాది నవంబరు 02 స్థిరవారం నుండి కార్తీకమాసం ప్రారంభమవుతుంది డిసెంబరు 02 సోమవారం తో పోలిస్వర్గంతో కార్తీకమాస దీక్ష పూర్తవుతుంది.
Andhra : ఏపీలో నవంబర్ నుంచి రేషన్లో కందిపప్పు, పంచదార, జొన్నలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డ్ దారులందరికీ నవంబరు నుంచి ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని MLSపాయింట్లకు సరిపడా సరుకులు రవాణా చేసేలా పౌరసరఫరాలశాఖ చర్యలు తీసుకుంది. నవంబరు1 నుండి రేషన్ కార్డు దారులందరికీ రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. కిలో కందిపప్పు రూ.67కు, అరకిలో పంచదార రూ.17కు అందించేందుకు చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.
AllAlerts : ఏలూరు ఉల్లిపాయబాంబ్ లు పేలిన ఘటనలో ఒకరు సంఘటన స్థలంవద్దే మృతి
ఏలూరు – దీపావళి పండుగ (Diwali) వేళ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. Eluru బాణాసంచా పేలిన ఘటనలో ఒకరు సంఘటన స్థలంవద్దే మృతి చెందారు. బైక్‌పై బాణాసంచాను తీసుకెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు అక్కడి ప్రజలు. కొద్ది సేపటి తరువాత బాణాసంచా పేలిందని తెలియడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుంతోంది. తాజాగా.. ఏలూరులో సుధాకర్ అనే వ్యక్తి బాణాసంచాను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఏలూరు తూర్పువీధి సెంటర్ వద్ద ఒక్కసారిగా ఆయన తీసుకెళ్తున్న బాణాసంచా పేలింది. దాంతో ఒక్కసారిగా పెనువిస్పోటనం సంభవించింది. బాణాసంచాను తీసుకెళ్తున్న సుధాకర్ పేలుడు ధాటికి రెండు ముక్కలయ్యాడు. సగబాగం చిందరవందరగా చుట్టుపక్కల పడ్డాయి. అలాగే అతని ... Read more
Chintalapoodi : జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అభివృద్ధికి తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే రోషన్ కుమార్
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రాగునీరు, రహదారుల అభివృద్ధి పనులకు 4.65 కోట్లతో ప్రతిపాదనలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో త్రాగు నీరు, రహదారి సమస్యలకు చెక్ పెట్టేందుకు 4.65 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. ఈ మేరకు ఈనెల 29వ తేదీన ఉదయం జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించనుంది. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ముందుగా గౌరవ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కు మున్సిపల్ కమిషనర్ కొమ్మనేని వెంకటరమణ వివరించారు. నియోజవర్గంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఆదాయం పెంచడం , వాటి పనితీరు మెరుగుపరచడం ద్వారా మరింత అభివృద్ధికి తోడ్పడుతామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి పట్టణ సుందరీకరణకు కోసం నిధులు మంజూరుకు కృషి చేస్తామని రోషన్ కుమార్ ఈ సందర్భంగా కమిషనర్ కు ... Read more
Nuziveedu : సంస్థాగతంగా బిజెపి బలోపేతం – మాజీ మంత్రి కామినేని
నూజివీడు : క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని మాజీ మంత్రి, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం నూజివీడు లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు.బిజెపి జిల్లా అధ్యక్షులు సి. హెచ్. విక్రమ్ కిషోర్ సమావేశానికి అధ్యక్షుత వహించగా పట్టణ అధ్యక్షుడు బోను అప్పారావు అతిధులకు ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నేత్రుత్వంలోని ఎన్. డి. ఏ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.గ్రామీణ స్థాయిలో బిజెపి మరింత బలపడటానికి కార్యకర్తలు కార్యోణ్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. అన్నీ వర్గాల నుంచి వస్తున్న మద్దతుతో ... Read more
kaikaluru : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దసరా మహోత్సవాలు ప్రారంభం.
కైకలూరు సెంటర్ లో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి క్షేత్రం నందు 44వ దసరా శరన్నవరాత్రి ఉత్సవములు శ్రీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం ఆద్వర్యంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్.కామినేని శ్రీనివాస్ కు ఆలయ మర్యాదలతో సత్కరించి ప్రసాదం అందించిన శ్రీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సేవాసంఘం అద్యక్షులు చొప్పర్ల మురళీకృష్ణ, సంఘ నాయకులు. పొన్నూరు కుటుంబ దంపతులచే కలశ స్థాపన చేసి పూజలు నిర్వహించిన అర్చకులు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఆర్యవైశ్య నాయకులు, మాలధారణ భవానీలు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమలలు : ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి.. సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అంటూ నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదశ్ ఉపాధ్యాయ సంఘం ఎన్టీఆర్ జిల్లా శాఖ ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సత్యం, అహింస ఆయుధాలుగా భారత దేశపు స్వేచ్ఛా స్వాతంత్య్ర సమరాన్ని ముందుండి నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమలలువేసి నివాళులు అర్పించారు. స్వరాజ్యం సాధించిన బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యం కావాలన్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. వారి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యాశాఖ అంటే ఒక పరీక్ష. ఛాలెంజ్ ... Read more
లడ్డూ విషయంలో రాజకీయాలొద్దు, టీడీపీ, వైసీపీ, జనసేనకు రిక్వెస్ట్ – వైఎస్ షర్మిల
తిరుమల లడ్డూ వ్యవహారంలో హాట్ కామెంట్స్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఒకరేమో శాంతి పూజలు.. మరొకరు ప్రాయశ్చిత్త దీక్ష.. ఇంకొకరేమో ప్రక్షాళన పూజలని అంటున్నారని చెప్పారు.దయ చేసి ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని, మతం రంగు పులమడం అంతకంటే కరెక్ట్ కాదన్నారు. ఇంతకీ షర్మిల వ్యాఖ్యల వెనుక అసలేం జరుగుతోంది? ఇదే చర్చ ఏపీ అంతటా మొదలైంది. తిరుమల లడ్డూ అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని అందరి కంటే ముందు ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేసిందన్నారు వైఎస్ షర్మిల. లడ్డూ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేయాలని సీజేఐకి, అటు కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ లేఖ రాసిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. సిట్ కంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరగాలన్న రీతిలో ఉన్నట్లు అర్థమవుతోంది షర్మిల. లడ్డూ విషయాన్ని రాజకీయం చేయొద్దని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మాజీ సీఎం జగన్ ... Read more