గురువారం అర్థరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ చోప్రా 89.45 దూరం జావెలిన్‌ను విసిరాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన నీరజ్ రెండో ప్రయత్నంలో రికార్డ్‌ను దూరాన్ని అందుకున్నాడు. దాంతో నీరజ్‌కు గోల్డ్ ఖాయమని అభిమానులు భావించారు. కానీ పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ జావెలిన్‌ను 92.97 దూరం విసిరి నీరజ్ గోల్డ్ ఆశలను ఆవిరిచేశాడు.