Matthew Perry death : ప్రముఖ టీవీ సిరీస్ ‘ఫ్రెండ్స్’ నటుడు మాథ్యూ పెర్రీ మరణంపై సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆయనకున్న డ్రగ్ అడిక్షన్ని తమకు ప్రయోజనకరంగా మార్చుకుని, కొందరు మాథ్యూకి అధిక మొత్తంలో ‘కేటమైన్’ ఇచ్చారు. కేటమైన్ ఓవర్డోస్తో ఆయన మరణించారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.