ప్రిన్సిపాల్ పై అనుమానాలు
నేరం జరిగిన రెండు రోజుల తర్వాత రాజీనామా చేసిన మెడకల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను సీబీఐ చాలా రోజులుగా విచారిస్తోంది. ట్రైనీ డాక్టర్ హత్య గురించి తెలియగానే మీరు ఏం చేశారని ఘోష్ ను సీబీఐ ప్రశ్నించింది. హత్య గురించి సమాచారం రాగానే, డాక్టర్ సందీప్ ఘోష్ ముందుగా ఎవరిని సంప్రదించాడనే విషయాన్ని కూడా ఆరా తీసింది. మృతదేహాన్ని అప్పగించే ముందు బాధితురాలి తల్లిదండ్రులను మూడు గంటల పాటు ఎందుకు నిరీక్షించారని డాక్టర్ ను ప్రశ్నించింది. ఆర్జీ కర్ ఆసుపత్రిలోని సెమినార్ హాల్ పక్కనే ఉన్న గదుల పునరుద్ధరణకు అనుమతి ఇవ్వడంపై కూడా ఆయనను ప్రశ్నించారు.