విద్యార్థుల నుంచి లంచాలు..
పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి డాక్టర్ సందీప్ ఘోష్ విద్యార్థుల నుంచి లంచాలు డిమాండ్ చేశాడని అక్తర్ అలీ ఆరోపించారు. సందీప్ ఘోష్ ప్రతి టెండర్ లో 20 శాతం కమీషన్ తీసుకునేవారని ఆయన పేర్కొన్నారు. ఆర్ జీ కర్ ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలపై కోల్ కతా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేశారు. “ఆర్ జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. త్వరలోనే అతడిని విచారించేందుకు అధికారులు సమన్లు జారీ చేయనున్నారు’ అని ఓ అధికారి తెలిపారు.