ఇంకోవైపు ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్, నిందితుడు సంజయ్ రాయ్, కోల్‌కతా పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ అనూప్ దత్తా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించారు. హత్య జరిగిన రెండ్రోజుల తర్వాత సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ఘటన తర్వాత సెమినార్ హాల్ సమీపంలోని గదులను పునరుద్ధరించాలని ఎవరు ఆదేశించారని అధికారులు ప్రశ్నించారు. ఈ నేరం వెనుక కుట్ర దాగి ఉందో లేదో తేల్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. ఆ రోజు విధుల్లో ఉన్న వైద్యులు, ఇంటర్న్‌లతో సందీప్ ఘోష్ సమాధానాలను సీబీఐ పోల్చి చూస్తోంది.