కోల్‌కతా వైద్యురాలి రేప్, హత్య వెనుక భారీ కుట్ర ఉందా? అన్న కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ని అధికారులు చాలా రోజుల పాటు విచారించారు. సంజయ్ రాయ్, డాక్టర్ సందీప్ ఘోష్ తదితరులకు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ సందీప్ ఘోష్‌పై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపైనా కోల్‌కతా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.