Wednesday, September 18, 2024
HomeNational&WorldKolkata doctor: ‘‘మీ అమ్మాయి చనిపోయింది. ఆత్మహత్య చేసుకుందేమో’’ - కోల్ కతా డాక్టర్ తండ్రితో...

Kolkata doctor: ‘‘మీ అమ్మాయి చనిపోయింది. ఆత్మహత్య చేసుకుందేమో’’ – కోల్ కతా డాక్టర్ తండ్రితో ఫోన్ చేసిన వ్యక్తి-might have died by suicide what caller told kolkata doctors father on aug 9 ,జాతీయ


మూడు ఫోన్ కాల్స్..

ఘటన జరిగిన రోజు రాత్రి బాధిత మహిళా డాక్టర్ తల్లిదండ్రులకు హాస్పిటల్ నుంచి మూడు ఫోన్ కాల్స్ వచ్చాయి. వాటిలో మొదటిది ఆర్జీ కర్ ఆస్పత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ చేశారు. ఆయన బాధితురాలి తల్లిదండ్రులను తొందరగా ఆసుపత్రికి రమ్మని కోరారు. ‘‘మీ కూతురికి ఆరోగ్యం బాగోలేదు. దయచేసి మీరు వెంటనే ఆసుపత్రికి రాగలరా?’ అని ఆయన ప్రశ్నించారు. బాధితురాలి తండ్రి మరిన్ని వివరాలు కోరగా ఆమెకు ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో చేర్పిస్తున్నామని చెప్పాడు. సమాచారం కోసం తండ్రి ఆ వ్యక్తిపై ఒత్తిడి తీసుకురావడంతో ఏం జరిగిందో వైద్యులు చెబుతారని చెప్పాడు. ఆస్పత్రికి వెంటనే రావాలని పట్టుబట్టారు. రెండో కాల్ చేసిన వ్యక్తి, బాధిత డాక్టర్ పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే హాస్పిటల్ కు రావాలని కోరాడు. కాసేపటి తరువాత మూడో కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి ‘‘మీ కూతురు చనిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు లేదా చనిపోయి ఉండవచ్చు. పోలీసులు వచ్చారు. మేము ఆసుపత్రిలో ఉన్నాము, అందరి ముందే, నేను ఈ కాల్ చేస్తున్నాను’’ అని చెప్పాడు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments