ఈ రాష్ట్రాల్లో వానలు
సెప్టెంబరులో దేశం మొత్తం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ఉత్తర బీహార్, ఈశాన్య యూపీ, ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు, దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వానలు పడే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరదలు, కొండచరియలు విరిగిపడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.