భారత్ లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఐఐటీ గువాహటిలో శుక్రవారం పీజీ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.