Saturday, September 21, 2024
HomeNational&WorldGoa flight: గోవా ఫ్లైట్ లో బాయ్ ఫ్రెండ్ కు వినూత్నంగా ప్రపోజ్ చేసిన యువతి;...

Goa flight: గోవా ఫ్లైట్ లో బాయ్ ఫ్రెండ్ కు వినూత్నంగా ప్రపోజ్ చేసిన యువతి; సోషల్ మీడియా ఫిదా..-panchkula woman proposes to boyfriend on flight to goa leaves internet in awe ,జాతీయ


ఫ్లైట్ లో లవ్ ప్రపోజల్..

ఆకాశంలో ఉండగా, తన ప్రేమను వ్యక్తం చేయాలని హర్యానాలోని పంచకులకు చెందిన ఐశ్వర్య బన్సాల్ (26) అనే యువతి భావించింది. తన బర్త్ డే రోజు బర్త్ డే పార్టీ కోసం ఐశ్వర్య తన 30 మంది స్నేహితులతో కలిసి గోవా వెళ్లడానికి ప్లాన్ చేసింది. అందుకు చండీగఢ్ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ ను వేదికగా ఎంచుకుంది. తన క్లోజ్ ఫ్రెండ్స్ కు ముందే విషయం చెప్పింది. ‘విల్ యూ మ్యారీ మీ’ అనే నాలుగు పదాలను నాలుగు ప్లకార్డులపై రాసి వారికి ఇచ్చింది. విమానం ప్రయాణిస్తుండగా, మోకాళ్లపై కూర్చుని, బాక్స్ లో నుంచి ఉంగరాన్ని బయటకు తీసి తన బాయ్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేసింది. అదే సమయంలో, తన ఫ్రెండ్ వారి సీట్లలో లేచి నుల్చని, ‘విల్ యూ మ్యారీ మీ’ ప్లకార్డులను పట్టుకున్నారు. అలాగే, అదే సమయంలో విమానంలో ‘స్పెషల్ అనౌన్స్మెంట్’ వచ్చేలా ప్లాన్ చేసింది. ఇంత ప్రేమగా, క్రియేటివ్ గా చేసిన ప్రపోజల్ ను ఎవరైనా కాదనగలరా?.. అతడు అవునని యాక్సెప్ట్ చేయగానే, అతడి వేలికి ఉంగరం తొడిగి, అతడిని మద్దు పెట్టుకుంటుంది. ఐశ్వర్య బన్సాల్ (26) ధైర్యం, క్రియేటివిటీ నెటిజన్లను విస్మయానికి గురిచేసింది.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments