ఛత్తీస్ గఢ్ లో..
ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మఢ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సంయుక్త బృందం గాలింపు చర్యలు చేపట్టిందని నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. బస్తర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్న సమయంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారని, దాంతో, పోలీసులు ఎదురుకాల్పులకు (ENCOUNTER) దిగారని ఎస్పీ వివరించారు. కాల్పులు ఆగిన తర్వాత ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టు సాహిత్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు.