పోలవరంపై ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచాం
‘‘కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన నిధులు దారి మళ్లించారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పిదాలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి. విభజన చట్టం ప్రకారమే ఏపీకి రావాల్సినవే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకంగా ఏదో ఇచ్చినట్లు కొందరు రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనే విభజన చట్టాన్ని రూపకల్పన చేసింది. జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల నిధులు దారి మళ్లించారని, ఈ రెండింటిలో చాలా రాష్ట్రాల కంటే ఏపీ వెనుకబడి ఉంది. ఏ మంత్రిత్వ శాఖ దగ్గరకు వెళ్లిన రాష్ట్రం వెనుకబడిన గణాంకాలే చూపిస్తున్నారు. అమరావతి, పోలవరం విషయంలో సాయం చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాను. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించడానికి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాం. రాష్ట్ర మంత్రి వర్గం చేసిన తీర్మానాన్ని అందజేశాను. పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన రూ.12,500 కోట్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపాలని కోరాను. నవంబర్ నుంచి పోలవరం పనులు ప్రారంభం అవుతాయి. మొదటి రెండు సీజన్‌లు కొత్త డయాఫ్రం వాల్ కట్టడానికే సరిపోతుంది. తరువాత కాఫర్ డ్యాం నిర్మిస్తాం” అని చంద్రబాబు అన్నారు.