Category: Telangana

Telangana – వరద బాధిత అన్నదాతలను ఆదుకునేందుకు 10వేలు ఆర్ధికసహాయం – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అన్నదాతల బాధలు చూసి వారిని ఆదుకునేందుకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి ప్రజలు, రైతులు నష్టపోయారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బాధితులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి చెప్పారు. అన్నదాతల బాధలు చూసి వారిని ఆదుకునేందుకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు.ఈ మేరకు మరో రెండ్రోజుల్లో రైతన్నలకు డబ్బులు అందజేయనున్నట్లు పొంగులేటి వెల్లడించారు. నేలకొండపల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

peacock : కోడి మాంసంతో నెమలికూర!

రాజన్న-సిరిసిల్ల జిల్లాలో ప్రణయ్ కుమార్ చేసిన పనికి అందరూ అవాక్అయ్యారు!సిరిసిల్ల జిల్లా తంగెళ్ళపల్లె గ్రామానికి చెందిన ప్రణయ్ యూట్యూబ్ పిచ్చితో నెమలి కూర ఎలా వొండాలో నేర్చుకొండి అంటూ.. ట్రడీషనల్ పికాక్ కర్రి అనే పేరుతో వంట వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసాడు, కాసేపటికే వీడియోకి వార్నింగ్ కామెంట్స్ రావడంతో.. యూట్యూబ్ నుండి వీడియో డిలీట్ చేసాడు, ఈ వీడియో గూర్చి ఫారెస్ట్ ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో, ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగి ప్రణయ్ కుమార్ ని అదుపులోకి తీసుకుని, ఆ ప్రాంతం అంతా పరిశీలించి, తను వొండిన కూరను హెన్డోవర్ చేసుకున్నారు. కూరను టెస్ట్ నిమిత్తం లాబ్ కు పంపుతున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రణయ్ కుమార్ మాత్రం నేను వండింది కోడికూర అని యూట్యూబ్లో వ్యూవ్స్ ఎక్కువగా వస్తాయని నెమలి కూర అని పోస్ట్ అప్లోడ్ చేసానని చెబుతున్నాడు. ఏదిఏమైనా యూట్యూబ్ పిచ్చితో చాలామంది అవగాహన లేని ... Read more