Category: Devotional
Bhimavaram : అయోధ్య శ్రీరామునికి 13 కేజీల వెండి, ఒక కేజీ బంగారంతో తయారుచేసిన ధనస్సు – శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు అందుకున్న అయోధ్య రాముని మహా ధనస్సు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మాట్లాడుతూ అయోధ్య నగరానికి వెళుతున్న ఈ రామ ధనస్సు ఎంతో విశిష్టమైనదని, ఏడు మోక్షమార్గాలలో అయోధ్య మొదటిదని, ఒక కేజీ బంగారం, 13 కేజీలు వెండితో తయారు చేసిన ధనస్సు చల్లా శ్రీనివాస ఆధ్వర్యంలో శ్రీరాముడు పుట్టిన అయోధ్యకు ఈ ధనుస్సుని తీసుకువెళుతున్నారని, ఈ ధనస్సు ఈ ప్రాంతానికి రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని తెలిపారు. శ్రీ మావుళ్ళమ్మ ఆలయం వద్ద జైశ్రీరామ్ నినాదాలతో భక్తి పారవశ్యంతో పర్వసిశించారు భక్తులు.
Devotional : కార్తీకమాసం విశేష రోజులు
నవంబరు 02 స్థిరవారం నుండి కార్తీక మాసం మొదలవుతోంది. నవంబరు 03 ఆదివారం యమవిదియ – భగినీహస్త భోజనం నవంబర్ 04 మొదటి కార్తీక సోమవారం నవంబరు 05, మంగళవారంనాగుల చవితి నవంబర్ 11 రెండవ కార్తీక సోమవారం నవంబరు 12 మంగళవారం ఏకాదశి నవంబరు 13 బుధవారంక్షీరాబ్ది ద్వాదశి దీపాలు నవంబరు 15 శుక్రవారం – కార్తీకపూర్ణిమ నవంబర్ 18 కార్తీకమాసం మూడో సోమవారం నవంబర్ 25 కార్తీకమాసం నాలుగో సోమవారం నవంబర్ 26 కార్తీక బహుళ ఏకాదశి నవంబర్ 29 కార్తీక మాసం మాస శివరాత్రి డిసెంబర్ 1, ఆదివారం కార్తీక అమావాస్య డిసెంబర్ 2 సోమవారం మార్గశిర శుధ్ధ పాడ్యమిపోలి స్వర్గం ఈ ఏడాది నవంబరు 02 స్థిరవారం నుండి కార్తీకమాసం ప్రారంభమవుతుంది డిసెంబరు 02 సోమవారం తో పోలిస్వర్గంతో కార్తీకమాస దీక్ష పూర్తవుతుంది.
kaikaluru : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దసరా మహోత్సవాలు ప్రారంభం.
కైకలూరు సెంటర్ లో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి క్షేత్రం నందు 44వ దసరా శరన్నవరాత్రి ఉత్సవములు శ్రీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం ఆద్వర్యంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్.కామినేని శ్రీనివాస్ కు ఆలయ మర్యాదలతో సత్కరించి ప్రసాదం అందించిన శ్రీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సేవాసంఘం అద్యక్షులు చొప్పర్ల మురళీకృష్ణ, సంఘ నాయకులు. పొన్నూరు కుటుంబ దంపతులచే కలశ స్థాపన చేసి పూజలు నిర్వహించిన అర్చకులు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఆర్యవైశ్య నాయకులు, మాలధారణ భవానీలు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా పైడితల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ
ఘనంగా పైడితల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ పైడితల్లి అమ్మవారి నామస్మరణతో జువ్వలపాలెం గ్రామం మారుమోగింది. కాళ్ళ మండలం జువ్వలపాలెం గ్రామంలోని తూర్పుపేటలో భక్తులు, దాతలు, గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో నూతనంగా నిర్మించిన గ్రామదేవత పైడితల్లి అమ్మవారి ఆలయంలో విగ్రహం, ఆలయ శిఖర, జీవధ్వజ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు పుల్లేటికుర్తి గణపతిశర్మ బ్రహ్మత్వంలో గురువారం ఉదయం 9:30 నిమిషాలకు వేదమంత్రాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.నర్సాపురం పార్లమెంట్ మాజీ సభ్యుడు గోకరాజు గంగరాజు, టీడీపీ బోర్డు మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, జనసేన నాయకుడు చెనమల్ల చంద్రశేఖర్తో పాటు పలువురు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు