Category: విశాఖ జిల్లా
Visakhapatnam : తల్లి మందలించిందని 20 ఏళ్ల యువకుడు ఆత్మహత్య
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని గాంధీనగర్లో తల్లి మందలించిందని 20 ఏళ్ల కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మళ్ల అప్పారావు, రూప దంపతుల కుమారుడు భాను ప్రకాష్ (20) చదువు మధ్యలో నిలిపివేసి, పూర్ణా మార్కెట్లోని పూల దుకాణం నిర్వహిస్తున్న తల్లి రూపకు సహాయంగా ఉండేవాడు. ఈ కార్యక్రమంలో ఇటీవల భాను ప్రకాష్ జులాయిగా తిరగడంతో తల్లి తరచూ మందలిస్తుండేది.శనివారం రాత్రి కూడా కుమారుడిని మందలించింది. ఈ నేపథ్యంలో గదిలోకి వెళ్లిన భాను ప్రకాస్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. సీఐ కేవి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు ఆత్మహత్య చేసుకోవడతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. మందలించడమే తప్పు అయిందా?, ఇలాంటి పనికి ఒడిగడతాడనుకుంటే మందలించేదాన్నే కాదంటూ తల్లి రోదనలు మిన్నంటాయి.
లడ్డూ విషయంలో రాజకీయాలొద్దు, టీడీపీ, వైసీపీ, జనసేనకు రిక్వెస్ట్ – వైఎస్ షర్మిల
తిరుమల లడ్డూ వ్యవహారంలో హాట్ కామెంట్స్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఒకరేమో శాంతి పూజలు.. మరొకరు ప్రాయశ్చిత్త దీక్ష.. ఇంకొకరేమో ప్రక్షాళన పూజలని అంటున్నారని చెప్పారు.దయ చేసి ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని, మతం రంగు పులమడం అంతకంటే కరెక్ట్ కాదన్నారు. ఇంతకీ షర్మిల వ్యాఖ్యల వెనుక అసలేం జరుగుతోంది? ఇదే చర్చ ఏపీ అంతటా మొదలైంది. తిరుమల లడ్డూ అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని అందరి కంటే ముందు ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేసిందన్నారు వైఎస్ షర్మిల. లడ్డూ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేయాలని సీజేఐకి, అటు కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ లేఖ రాసిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. సిట్ కంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరగాలన్న రీతిలో ఉన్నట్లు అర్థమవుతోంది షర్మిల. లడ్డూ విషయాన్ని రాజకీయం చేయొద్దని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మాజీ సీఎం జగన్ ... Read more