Category: తిరుపతిజిల్లా
Tirupati : టీటీడీలో ప్రక్షాళన జరిగింది కాబట్టే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయి టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు.
వచ్చే బోర్డు మీటింగ్‌లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం- టీటీడీ నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీ నూతన ఛైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. తనకు ఆ బాధ్యత అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు వచ్చే బోర్డు మీటింగ్ లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి కొన్ని మార్పులు చెయ్యాల్సి ఉందన్నారు. సవాళ్లు ఉన్నాయని, అన్నింటిని అధిగమిస్తామన్నారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ ఎలా కాపాడుకోవాలి అనే దానిపై దృష్టి పెడతామన్నారు ఉద్యోగాల నియామకాలపై అధ్యయనం చేస్తామన్నారు. శ్రీవాణిపై ప్రజల్లో అపోహ ఉందన్న బీఆర్ నాయుడు.. విజిలెన్స్ విచారణ జరుగుతోందని, సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. టీటీడీలో ప్రక్షాళన జరిగింది కాబట్టే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయని టీటీడీ నూతన ఛైర్మన్ అన్నారు. టీటీడీ నూతన ఛైర్మన్ గా బీఆర్ నాయుడు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 16 ... Read more
Tirupati : శ్రీవారి అన్న ప్రసాద భవనాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ -కుటుంబ సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు.
తిరుమలలోని శ్రీవారి అన్న ప్రసాద భవనాన్ని బుధవారం రాత్రి టీటీడీ నూతన చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర అన్న ప్రసాదం కార్యాకలాపాలను చైర్మన్ కు వివరించారు. అన్న ప్రసాద భవనంలో ఒకరోజులో ఎంతమంది భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరిస్తారు, అందిస్తున్న వివిధ రకాలైన ఆహార పదార్థాలు, అన్న ప్రసాద భవనం పని చేసే వేళలు తదితర విషయాల గురించి సవివరంగా తెలియజేశారు.
Tirupati Accident : శిల్పారామంలో ఆటవిడుపు కోసం వెళ్ళి మృతి చెందిన యువతి.
తిరుపతి మండలం తిరుచానూరుఅర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుపతి శిల్పారామంలో జ రిగింది. ప్లే జోన్లో ఉన్న శిల్పారామంలో క్రాస్ వీల్ బకెట్ ఊడిపడటంతో అందులో కూర్చున్న యువతులు కిందప డిపోయారు. ఈ ఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా మ రొకరు తీవ్రంగా గాయపడ్డారు.ఆదివారం సెలవు దినం కావడంతో ఆటవిడుపు కోసం వెళ్లిన ఇద్దరు యువతులు అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యారు. తిరుపతి జిల్లా, తిరుచానూరు రోడ్డు లోని శిల్పారామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఎక్కిన క్రాస్ వీల్ తుప్పు పట్టి ఊడి కిందపడటంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతికి చెందిన లోకేశ్వరి(25), గౌతమి లు ఆదివారం సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు శిల్పారామం వచ్చారు. ఇద్దరు కలిసి అక్కడ ఉన్న క్రాస్ వీల్ ఎక్కారు. అది వేగంగా తిరుగుతుండగా యువతులు కూర్చొన్న సీటు దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి ఊడి కింద పడింది. దీంతో లోకేశ్వరి తీవ్ర ... Read more
తిరుమలలో మరోసారి చిరుత కలకలం..
శనివారం అర్ధరాత్రి సమయంలో తిరుమలలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది.. శ్రీవారి మెట్లు మార్గంలో చిరుత సంచారం.. అర్ధరాత్రి సమయంలో కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చిన చిరుత.. భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి లాక్ వేసుకున్న సెక్యూరిటీ గార్డ్.. టీటీడీ అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చిన సెక్యూరిటీ గార్డ్.. సీసి టీవి ఫుటేజ్ పరిశీలించిన అధికారులు.